.
మన మందఱము ఒక్క టన్నాడు !
పిఱికితనమును విడువు మన్నాడు !
వీరుడవుగా బ్రతుకు మన్నాడు !
.
“ బానిసలుగా బ్రతుకు
బ్రతుకెందు ? ” కన్నాడు !
స్వాతంత్ర్యసమరాన
చావు మే లన్నాడు !
.
సత్యమ్మునే అతడు పలికాడు !
సత్యాగ్రమ్మునే సలిపాడు !
హింస రాక్షసనై జ మన్నాడు !
తా నహింసకే బ్రతుకు వెలబోశాడు !
.
దొరల నీదేశమును
విడిచి పొం డన్నాడు !
అన్నమును ముట్టకే
అలిగి కూర్చున్నాడు !
.
అతనిశక్తికి దొరలు
అదిరిపడిపోయారు !
స్వాతంత్య్రమును ఇచ్చి
ౘక్క పోయారు !
.
కలసికట్టుగ మనము
నిలబడా లన్నాడు !
రామరాజ్యమె మనకు
రావాలి అన్నాడు !
.
బోసినవ్వులతాత
మాట బంగరుమూట !
తాత చూపినబాట
మనకు పువ్వులబాట !
.
తాతయ్యమాటలను
మఱవ కుండాలి !
మనము తాతయ్యంత
వారలము కావాలి !!
.
—— ( 0 ) ——