12_005

12_005

.

ప్రస్తావన

.

 ప్రపంచం రోజు రోజుకీ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. గత రెండు, మూడు దశాబ్దాలుగా సాంకేతికాభివృద్ధి జెట్ వేగంతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం నవీకరించుకోవడం ఆవశ్యకం అయింది. లేకపోతే వెనుకబడిపోవడమే కాదు. కొన్నిసార్లు మనకి తెలిసిన సాంకేతికత మనుగడలోనే ఉండకపోవచ్చు. సాంకేతికాభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందో, ఆ అభివృద్ధిని అడ్డుపెట్టుకుని చేసే మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి.

కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు అభివృద్ధి చాలా వేగంగా జరిగిందనే చెప్పవచ్చు. ఇంకా జరుగుతూనే ఉంది. వీటి సాయంతో మనం నిత్యం చేసుకునే పనులన్నీ చాలా సులువుగా అయిపోతున్నాయి. ఉదాహరణకి 21వ శతాబ్ద ప్రారంభంలో కూడా విద్యుత్ బిల్లు కట్టాలంటే వాళ్ళ కౌంటర్ కి లేదా మీ సేవ సెంటర్ కి వెళ్ళి క్యూలో వేచి ఉండి కట్టవలసి వచ్చేది. దీనికి అరగంట నుంచి కొన్ని గంటలవరకు కూడా సమయం పట్టేది. అయితే ఇప్పుడు మన ఫోన్లో విద్యుత్ సంస్థ ఆప్ పెట్టుకుంటే రెండు నిముషాల్లో ఆ పని పూర్తి చేసుకోవచ్చు. దీనివలన ఎంతో సమయం ఆదా అవుతోంది. ఒక పనికోసం ఒక పూట వెచ్చించడం నుంచి ఒక నిముషంలోనే పూర్తి చేసుకునే సౌలభ్యం వచ్చింది. అలాగే బ్యాంకింగ్ కార్యకలాపాలు. గతంలో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ కి వెళ్ళి చెక్ ఇచ్చి టోకెన్ తీసుకుని కొంత సమయం వేచి చూస్తే గాని మనవంతు వచ్చేది కాదు.  ఏ‌టి‌ఎం లు వచ్చి చాలా సమయాన్ని ఆదా చేశాయి. అలాగే చెల్లింపులు కూడా చాలావరకు సులువుగా ఫోన్ ద్వారానే చేసేస్తున్నాం. నిత్యావసరాలు, అల్పాహారాలు వంటివి కావాలంటే స్వయంగా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్తితి నుంచి ఫోన్ ద్వారా కావలసినవన్నీ ఆర్డర్ పెట్టి తెప్పించుకునే స్థాయికి సాంకేతికత ఎదిగింది.

ఇవన్నీ ఒక ఎత్తైతే వీటి ఆధారంగా పెరిగిన మోసాలు మరో ఎత్తు. గతంలో బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నపుడో, షాపింగ్ కి వెళ్ళినపుడో, పెళ్లి లాంటి వేడుకలు వంటి వాటిల్లో మన పర్సులని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండకపోతే దొంగల పాలయ్యేవి. ఇప్పుడు ఎవరి దగ్గరా పర్సులే ఉండడం లేదు. ఉన్నా అందులో రకరకాల కార్డులే తప్ప డబ్బులు ఉండడం లేదు. అందుకని దొంగలు కూడా క్రొత్త మార్గాలు అన్వేషించడం మొదలు పెట్టారు. సాంకేతిక ప్రగతిలో ప్రయోజనాలతో బాటు ప్రమాదాలు కూడా అభివృద్ధి చెందాయి. క్రొత్త క్రొత్త దొంగలు తయారయ్యారు. సంప్రదాయ దొంగలకు వీళ్ళు భిన్నం. కన్నం వేసే చారుదత్తుల నుంచి దొంగతనాల పద్ధతులన్నీ కూడా ఆధునీకరించబడ్డాయి. సాంకేతిక పరిజ్ఞానం వీరి ఆయుధం. మొదట్లో ఏ‌టి‌ఎం ల దగ్గర దృష్టి మరల్చి దొంగతనాలు చేసినా ఇప్పుడు వాటి స్థానంలో స్మార్ట్ దొంగతనాలు పెరిగిపోయాయి. ఏ‌టి‌ఎం కార్డ్ కున్న పిన్ సంఖ్య దొంగిలించడం, తద్వారా మన ఖాతాలోని డబ్బుని ఖాళీ చేసేవారు. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ లో ఉన్న బ్యాంక్ ఆప్ ల వివరాలు రకరకాల మార్గాలలో సేకరించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

బిజీ గా ఉన్నప్పుడు మన ఫోన్ కి ఓ కాల్ వస్తుంది. మనకి తెలియని నెంబర్. ఎవరో అనుకుని జవాబిస్తాం. ఏవో ఆఫర్లు ఉన్నాయని లేదా మీకు లాటరీ లో కొన్ని లక్షలు వచ్చాయని, ఇంకా ఏవో ప్రలోభాలకు గురి చేసి మన వివరాలు అడుగుతారు. వాటి ద్వారా మన ఖాతా ఖాళీ చేస్తారు. ఇదే రకంగా మెసేజ్ లు వస్తాయి. అందులో కొన్ని లింక్ లు ఇస్తారు. పొరబాటున అదేమిటో చూద్దామని ప్రయత్నించామా మన ఫోన్లోని సమాచారమంతా వారికి చేరిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ల ద్వారా చేసే మోసాలు పెరిగిపోయాయి. అంతర్జాలంలో హాకింగ్ చాలా పెద్దయెత్తున జరిగేది. వైరస్ ల దాడి జరిగేది. వీటి ద్వారా అనేక మోసాలు జరిగేవి. అయితే వీటన్నిటికీ సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం. అందుకే ఇంతకంటే సులువైన మార్గాలు ఎంచుకుంటున్నారు ఇప్పటి అంతర్జాల దొంగలు. అందులో ఒకటి మన సోషల్ మీడియా ఖాతాను పోలిన నకిలీ ఖాతా సృష్టించి, అందులో కూడా మన స్నేహితులను అందరినీ కలుపుకుని, వాళ్ళకి ( మీ పేరుతోనే ) ‘ అనుకోకుండా ఇబ్బంది వచ్చిందని, కొంత సొమ్ము పంపిస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తానని మెసేజ్ పంపిస్తారు. పంపించాక పత్తా ఉండరు. ఇంకా క్రొత్త క్రొత్త మోసాలకు తెర తీస్తూనే ఉన్నారు.

గతంలోని దొంగలు ఎప్పుడో ఒకప్పుడు దొరికేవారు. వారు తప్పించుకునే మార్గాలు పరిమితంగా ఉండేవి. ఇప్పుడు ఎన్నో మార్గాలు. పోలీసులు ఏ మార్గంలో కనిపెట్టి పట్టుకున్నా వెంటనే క్రొత్త మార్గం కనుక్కుంటున్నారు. అందుకని మనం ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమరపాటు గా ఉండకూడదు. ప్రమోషన్ కాల్స్ పేరుతో చేసే వాటిని జాగ్రత్తగా గమనించాలి. మీ వివరాలు, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్ సంఖ్యలు మొదలైన వాటిని అడిగినపుడు అస్సలు స్పందించకూడదు. బ్యాంక్ నుంచి మన వివరాలు అడుగుతూ కాల్స్ రావు. ఈ విషయం మన బ్యాంక్ లే అప్పుడప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటాయి. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండటం చాలా అవసరం. అంతర్జాల వినియోగం ఎంత అవసరమో మన అప్రమత్తత కూడా అంతకంటే ఎక్కువ అవసరం. 

 

గమనిక : ఇప్పటివరకు పక్ష పత్రికగా వెలువడుతున్న ‘ శిరాకదంబం ’ వచ్చే నెల నుంచి మాసపత్రిక గా అనివార్య పరిస్థితుల్లో మార్చవలసి వస్తోంది. ప్రస్తుతం ‘ అక్షర రూప సంచిక ’, ‘ దృశ్య శ్రవణ సంచిక ’ లుగా నెలకి రెండు సంచికలు వెలువడుతున్నాయి. ఇకపైన రెండూ కలిపి ఒకే సంచికగా వెలువడుతుందని గమనించ ప్రార్ధన.

 

మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.        

.

******************************************************************************************

.

 

 
 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ