10_005 నవదుర్గలు

 

          నవదుర్గలలో ప్రథమంగా శైలపుత్రి హిమవంతుని కుమార్తె. శివుని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేస్తుంది. మన్మథ దహనం ఈమె వృత్తాంతంలోనే జరుగుతుంది. బ్రహ్మచారిణి అనేది ఈమె రెండవ రూపము. శివుని తలపైన ధరించే చంద్రవంక తను కూడా ధరించాలని కోరుకుంటె శివుడు గంట ఆకారంలో ఉండే చంద్రుణ్ణి అలంకరిస్తారు. ఈ కారణంగా ‘ చంద్రగంట ’ అనే పేరు వస్తుంది. తర్వాత పేరు కూష్మాండము. అనంతరం ‘ స్కంధమాత ’ గా అవతరిస్తుంది. ‘ కాత్యాయని ’ అనే పేరుతో తరవాత కాలంలో జన్మిస్తుంది. ‘ కాళరాత్రి ’ అనే పేరుతో అవతరించి దుష్టులను, రాక్షసులను సంహరిస్తుంది. తరువాత ‘ మహాగౌరి ’ గా చాలా తెల్లనైన శరీరాన్ని శివుని ద్వారా పొందింది. చివరి అవతారం ‘ సిద్ధిధాత్రి ’. కావలసిన సిద్ధులను ఇచ్చినది కాబట్టే ‘ సిద్ధిధాత్రి ‘ అనే పేరు వచ్చింది.

నవదుర్గలను గురించి వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. గతంలోని వీడియోలో……