10_015 బాలభారతి – తెనుగుదనము

.

మనిషితనమును మేలుకొలపాలి

మంచితనమును జగతి నిలపాలి !

మనలో విభేదాలు పోవాలి

మమతతో హృది పొంగిపోవాలి !

.

                                    తెనుగుతీయందనము పండాలి !

                                    తెలుగువెలుగులు దేశాల నిండాలి !

                                    మనసు మల్లెలమాల యై పరిమళించాలి ! 

                                    మాటలో మనసులో మధువు లొలకాలి !

.

“ తెనుగుదేశము నాది

  తెనుగు వాడను నేను

  తెనుగు నాబాస ” అని పలకాలి !

తెనుగుదన మెడదలో కులకాలి !

.

***************