అమెరికాలోని చికాగో లో శ్రీ షిర్డి సాయి మందిర్ సహకారంతో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ అమెరికా ( సప్నా ) అధ్వర్యంలో 18వ అంతర్జాతీయ వీణ సమావేశం, ఉత్సవం మే నెల 7, 8 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మొదటిరోజు “ వీణ వాద్య రవళి ” కార్యక్రమం ఉదయం నుండి సాయింత్రం వరకు నిర్వహించబడుతుంది. ఇందులో శ్రీ కళాపూర్ణ రాజేశ్వరి పరిటి, శ్రీ కళాపూర్ణ సరస్వతి రంగనాథన్, భవ్య బెహర మొదలైన కళాకారుల ప్రదర్శన ఉంటుంది. వీటితో బాటు విద్యార్థుల ప్రదర్శనలు కూడా ఉంటాయి.
రెండవరోజు “ రాగ ప్రభ ” పేరున మహామహోపాధ్యాయ డా. ఈమని శంకరశాస్త్రి గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా
అంతర్జాల వీణ కచేరీలు జరుగుతాయి. ఇందులో ప్రధానంగా సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత డా. అయ్యగారి శ్యామసుందరం, డా. ఈమని కళ్యాణి లక్ష్మినారాయణ, సాత్విక్ గురుపల్లి, వీణా విధుషి జయలక్ష్మీ అయ్యగారి గారల వీణ కచేరీలు ఉంటాయి.
అదే రోజు “ వాఙ్మయ వేదిక “ సాహిత్య కార్యక్రమం, “ వీణ రవళి ” పేరుతో సంగీత కార్యక్రమం జరుగుతాయి. శ్రీ కళాపూర్ణ ఆచార్య శ్రీనివాస్ వేదాల గారికి ‘ సరస్వతి పుత్ర ‘ బిరుద ప్రదానం సన్మానము, ‘ సౌభాగ్య లహరి ‘ గ్రంథావిష్కరణ కార్యక్రమాలు, అనంతరం ‘ రాగప్రభ ’ కార్యక్రమంలో కళ్యాణి, హిందోళ రాగాల పైన డా. షెల్లీ కుమార్, డా. శారద శొంఠి ల చర్చా కార్యక్రమం, “ అమరికాలో వీణా ఉత్సవాలు ” డా. శ్రీరామ్ శొంఠి గారి పవర్ పాయింట్ ప్రదర్శన, శ్రీ కళాపూర్ణ రమ గురుపల్లి, వీణా విధుషి నీల అమరవాది, వీణా విధుషి అను గంటి మరియు విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయి.
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾