13_001 చిత్రకదంబం

 

 

అడవి.

అందులో ఒక గ్రామం.

నాగరికతకు దూరంగా బ్రతికే ఆ గ్రామ గిరిజనులలో ఎన్నో మూఢ నమ్మకాలు.

ఆ గ్రామం నుంచి నగరానికి వెళ్లడానికి సులువైన దారి ఒకటి ఉంది. అయితే ఆ గ్రామ ప్రజలు ఆ దారిలో వెళ్లడానికి భయపడతారు.

కారణం ఆ దారిలో వెళ్ళే గ్రామస్తులలో కొందరు అదృశ్యమవడం.

ఆ దారిలో ఒక దెయ్యం ఉందని, ఆ దారిలో వెళ్ళే వారిని అదే చంపుతోందని గట్టి నమ్మకం పెంచుకున్నారు.

చాలా దూరం ఉండే మరో దారి గుండా నగరానికి వెళ్ళడం ఆరంభించారు.

విక్రమ్ అనే ఒక పరిశోధనాత్మక పాత్రికేయ విద్యార్థి ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక అమ్మాయిని చూడటం, ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది. ఆ సందర్భంలో అతను అక్కడే ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసుని అతడు ఎలా పరిష్కరించి అందులోంచి ఎలా బయిట పడ్డాడు అనేది ‘ అన్వేషి ‘ చిత్రంలో ప్రధానమైన కథ.

వి. జె. ఖన్నా దర్శకత్వంలో విజయ్ ధరణ్ కథానాయకుడుగా, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ళ కథానాయికలుగా రూపొందిన ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కె. కె. రావు ( రాజేంద్ర ), సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.

***************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page