ప్రస్తావన |
2020 వ సంవత్సరం ‘ కల్లోల ’ సంవత్సరంగా ప్రకటించవచ్చేమో ! సమాజానికి పట్టిన చీడపురుగులు ఎన్ని నశించిపోయినా ఎవరికీ బాధ ఉండదు. నిజానికి అవి నశించాలనే అందరూ కోరుకుంటారు. కానీ అలాంటి చీడపురుగుల జోలికి వెళ్లడానికి ‘ కరోనా ’ కి కూడా ధైర్యం సరిపోవడం లేదేమో ! అందుకే ఈ వైరస్ సమాజహితాన్ని కోరుకునేవారు, సమాజ సేవ చేసేవారు, పదిమందికీ మంచిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచాలనుకునేవారు బలైపోతున్నారు. మంచిని భరించే పరిస్థితి భూమికి లేదనేమో ! అందర్నీ పై లోకాలకు తరలించుకుపోతున్నారు.
‘ కరోనా ’ విలయ తాండవం చేస్తూ ఉండగానే, గత కొన్ని సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసాయని తాగునీటికి, సాగునీటికి లోటు ఉండదని సంబరపడుతుంటే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రెండు రాష్ట్రాలను ముంచేస్తున్నాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
ఆకాశం నుండి ఏకధార…. జనం కంటి నుండి అశ్రుధార.
ఇప్పుడే తుఫాను కాలం ప్రారంభమైంది. ముందు ముందు ఇంకా ఏం చూడాలో ? ఏం భరించాలో ?
ఇటీవల వరుసగా తెలుగు వారందరికీ గర్వకారణమైన ప్రముఖ వ్యక్తులను కోల్పోతున్నాం. క్రిందటి నెలలో గాన గంధర్వుడు, ఇప్పుడు నాట్యమయూరిని కోల్పోయాం. నిజంగా ఇటీవల తెలుగు జాతికి ఏదో శాపం తగిలిందనిపిస్తోంది.
అప్సరసలలో కలిసిపోయిన కూచిపూడి నాట్యానికే శోభాయమానంగా భాసించిన శోభానాయుడు గారికి ‘ శిరాకదంబం ’ తరఫున నివాళులు అర్పిస్తూ…. మిత్రుడు, చిత్రకారుడు కూచి అందించిన నివాళి….
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –
- ‘ అభిజ్ఞ ’ మిత్రబృందం – జూలై, 2020 – ₹. 10,000/-
– ఆగష్టు, 2020 – ₹. 10,000/-
- శ్రీ వై. రామకృష్ణ, చెన్నై – రెండు సంవత్సరాలు – ₹. 1,000/-
- శ్రీ కె. వి. ఆర్. శర్మ, హైదరాబాద్ – రెండు సంవత్సరాలు – ₹. 1,000/-
- శ్రీ ఏ. ఫణికుమార్, హైదరాబాద్ – ఒక సంవత్సరం – ₹. 600/-
- శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ, విజయవాడ – రెండు సంవత్సరాలు – ₹. 1000/-
- శ్రీ దేవగుప్తపు వెంకటరావు, హైదరాబాద్ – ఒక సంవత్సరం – ₹. 600/-
- శ్రీ జి. ఎస్. వి. సూర్యనారాయణమూర్తి – ఒక సంవత్సరం – ₹. 600/-
- శ్రీ శ్రీకాంత్ అబ్బూరి, ఆస్ట్రేలియా – రెండు సంవత్సరాలు – $. 20/-
- శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు, పుల్లేటికుర్రు, తూ. గో. జిల్లా – రెండు సంవత్సరాలు – ₹. 1000/-
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో
$. 15.
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
****************************************************************************************
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
or Click here –> paypal.me/sirarao
*********************************************************************************************
**********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…