12_011 రాధ విరహగీతం

అసలు రాధా తత్త్వం అంతా జయదేవుని అష్టపదుల్లో వర్ణించబడింది. సంస్కృత సాహిత్యంలో ఇవి విశ్వప్రసిద్ధి గాంచినవని అందరికీ తెలిసినదే.

జయదేవుని రచనల్లో ఉండే రసమాధుర్యం. అదే లాలిత్యంలో వ్రాసిన ఈ అష్టపదులలో ఒకటి సందర్భోచితమనిపించి, పాఠకుల కోసం అందచేస్తున్నాను. 

రాధా తత్వాన్ని ప్రతిబింబించే కవితా సౌందర్యాన్ని శ్రీ  ఉయ్యూరు కుమార రాజావారు తెనిగించారు. ఆ అనువాద రచన ….

 

ఓ చెలియా, కేశి మదనునుదారున్ 

వలపుటాశలనుండి కలపు నాలోనిట్లు  విలసిల్లు ననురాగసారున్ || 

 

దట్టంపు పొదరిల్లు తనకై చొచ్చిన రేయి దాగి కన్పడకుండెనే 

ఇట్టిట్టు బేలనై నేజూడ కూరిమి నా కెదురుగ  నవ్వుచు వచ్చెనే 

 

తొలిసిగ్గు నిండునాతో వేడుకగ బలికి అలరి నన్నలరించెనే 

లలితంపు లేనవ్వు దొలకించు  నాపైని వలువ వదులుగ సర్దేనే 

 

చిగురు పాన్పున నన్ను చేర్చి నా చనులందు శిరమునుంచి శయనించెనే 

బిగి కౌగిలించేనే ప్రీతి ముద్దు గొనంగ పెదవి చవి గొనబూనెనే 

 

ముదమెంచి కనులింత  మూసేనే తన చెక్కులదర తానుప్పొంగేనే 

కొదమ మేనే  చెమ్మగదుర తానెంతెంతో  ముదమొప్ప చెలరేగెనే 

 

కళారవములు కోకిల వలెనే  పలుక లలిప్రేమ వలనులెంచేనే 

తలిరులకురులను  గలిగిన నామేను అలరా గోటి కొనలుంచేనే 

 

ఘల్లుఘల్లు మని నా యందెలు మ్రోగ  పలుతీరులు తెలిసి గూడేని 

కలగ నొడ్డాణంబు కదలునను కచమూని  కడునొత్తి ముద్దాడెనే 

 

పరమ పావని యౌ గోపాల నాయిక పలుకు సరసమౌ హరిచరితమే 

గురుడౌ జయదేవ వారధుడౌ శ్రీ రాధావరు లీలా సుధాభరితమే || 

 

ఇదే అష్టపది సంస్కృతంలో కె. సీత వసంత లక్ష్మి కంఠంలో……. 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page