—
దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం అనే ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ పిలుపుకు ప్రభావితులై స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించారు రాజేంద్రప్రసాద్. ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ సాహచర్యంలో స్వాతంత్ర్యోద్యమం గురించి పత్రికలలో అనేక వ్యాసాలూ రాసారు. ఉద్యమ ప్రచారం కోసం అనేక ప్రాంతాలు పర్యటించారు. ఆ ఉద్యమంలో పూర్తి సమయం పనిచెయ్యడం కోసం బంగారు బాతు లాంటి న్యాయవాద వృత్తిని త్యజించారు.
డిసెంబర్ 03వ తేదీ మన తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా………