.
ప్రస్తావన
ప్రతీ సమాజంలో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. దాదాపుగా ఆ సమాజంలో సభ్యులందరూ వాటిని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటారు. నిజానికి ఈ సాంప్రదాయాల్లో చాలావరకు సమాజ హితం కోరుకునేవే. అయితే కాలక్రమేణా కొంతమంది స్వార్థం కోసమో, స్వప్రయోజనాల కోసమో, మరే ఇతర ప్రయోజనం కోసమో వారికి అనుకూలంగా తమకు తోచిన అనేక మార్పులు చెయ్యడం, ప్రశ్నించిన వారిని అజ్ఞానులుగానో, సంఘ ద్రోహులుగానో ముద్ర వేయడం జరిగేది. వారు అలా ప్రశ్నించడం వలన అనేక అరిష్టాలు జరుగుతాయని సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆ విషయం మీద ఎవరూ మాట్లాడే ధైర్యం చేయకుండా నిలువరించేవారు. దానితో కొన్ని మంచి ఆచారాలు, సంప్రదాయాలు కూడా దురాచారాలుగా, దుస్సాంప్రదాయలుగా మారిపోయాయి. ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో అని భయంతో ఎవరూ కూడా నోరెత్తే ధైర్యం చేసేవారు కాదు. సమాజంలోని ప్రజలందరిలో మానసికంగా ఆ భయం గూడు కట్టుకుని ప్రశ్నించే తత్వాన్ని దాదాపుగా కోల్పోయారు. నచ్చకపోయినా, అనుమానాలు ఉన్నా గుడ్డిగా ఆచరించడమే అలవాటు చేసుకున్నారు. ఒక పుకారు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుంది. ఒక మనిషి నుంచి మరో మనిషికి చేరే క్రమంలో అది రూపాలు మార్చుకుంటూ గోరంత… కొండంత అవుతుంది. అలాగే ఈ దురాచారాలు, దుస్సాంప్రదాయలు కూడా మొదట్లో ఎవరి స్వప్రయోజనం కోసమో చిన్నదిగా మార్పు జరిగినా కాలక్రమేణా ‘ వటుడింతై… ’ అన్నట్లు స్వరూపాలు విపరీతంగా మారిపోయాయి.
అయితే సమాజాన్ని సరైన దిశానిర్దేశం చెయ్యడానికి, ఈ దురాచార, దుస్సంప్రదాయ ఊబిలోనుంచి ప్రజల్ని బైట పడెయ్యడానికి కొంతమంది సంస్కర్తలు ఉద్భవిస్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. ఒక ఉదాహరణని పరిశీలిస్తే గత శతాబ్దం మొదటి వరకు అమలులో ఉన్న ‘ కన్యాశుల్కం ’ దురాచారం కనబడుతుంది. అయితే మొదట్లో అది మంచి ఆచారంగానే ప్రారంభమయ్యే ఉందవచ్చు. బహుశా ఆడపిల్ల ఆర్థిక భద్రత కోసం కొంత ఆస్తిని ఆమె పేర ఉంచే ఉద్దేశ్యంతో ఈ సంప్రదాయం వచ్చి ఉండవచ్చు. ఎవరి స్వార్థం వలనో దీనికి వక్రభాష్యాలు ఏర్పడి ఉండవచ్చు. అది దుస్సాంప్రదాయంగా మారాక నివారణ కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే గురజాడ అప్పారావు గారి ‘ కన్యాశుల్కం ’ ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పవచ్చు. ఆ దురాచారాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో విజయవంతమైంది. ఒక దురాచారాన్ని రూపుమాపడంలో, సమాజంలో మార్పు రావడానికి సాహిత్యం ఎంత శక్తివంతమైన సాధనమో ఇలాంటి రచనలు తెలియజేస్తున్నాయి. అనంతర కాలంలో ఈ ‘ కన్యాశుల్కం ’ అనే దురాచారం సంఘంలో ఎక్కడా కనిపించకుండా పోయింది. స్త్రీలు విద్యార్జనకు అనర్హులు అనే దుస్సాంప్రదాయం ఉన్న రోజుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రారంభించిన ‘ బాలికా విద్య ’, ‘ బాల్య వివాహాల నిర్మూలన ’, ‘ విధవా పునర్వివాహం ’ వంటి కార్యక్రమాలు చేపట్టి తన రచనలతోను, తన పత్రికల ద్వారా ప్రజలను జాగృతం చేసారు. ఆ ఫలితాలను మనమిప్పుడు చూస్తున్నాం. ఇంకా చాలా దురాచారాలను రూపుమాపడానికి, వాటి విషయంలో ప్రజల్ని అప్రమత్తం చెయ్యడంలో సాహిత్యం ప్రధాన పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణలు ‘ వరవిక్రయం ’, ‘ చింతామణి ’ వంటి నాటకాలు, స్వాతంత్ర్య సమరంలో ప్రజలందర్నీ ఉత్తేజపరిచిన సాహిత్యం వంటివి చాలా చెప్పుకోవచ్చు.
సాహిత్యం వలన మానసిక వికాసం, మానసికానందం గా మాత్రమే కాక సమాజహితం కోరే, దురాచారాల మీద పోరాటం చేసే శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయా కాలాలలో ఉన్న దుస్సాంప్రదాయాలను నిరసిస్తూ అప్పటి రచయితలు రచనలు చెయ్యడం, అనంతరకాలంలో ఆయా దురాచారాలు చాలావరకు రూపు మాసిపోవడం లేదా తగ్గిపోవడం దీనికి ఉదాహరణలుగా చూడవచ్చు. సాహిత్యం సమకాలీన సమస్యలకు ప్రతిబింబంగా, వాటికి పరిష్కారాన్ని చూపించడానికి దోహదపడే శక్తిగా ఉపయోగపడుతోందనడంలో ఏ సందేహం లేదు. అయితే ఆయా కాలంలోని సమస్యలపై ఉద్యమించి చేసిన రచనలను అప్పటి పరిస్థితులకనుగుణంగా చేసిన రచనలుగానే చూడాలి. ఆయా సమస్యలు రూపు మాసిపోయినా కూడా ఆయా రచనలు ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాలు ఏర్పరుచుకున్నాయి. దానికి ప్రధానమైన ఉదాహరణ శతాబ్దం దాటిపోయి చాలాకాలం అయిన ‘ కన్యాశుల్కం ’ నాటకం.
కాలక్రమేణా మంచి సాంప్రదాయాలు దుస్సాంప్రదాయలుగా రూపాంతరం చెందినట్లే ఇలాంటి నాటకాలలో ఆయా నటులు, దర్శకులు కొందరు కూడా కాలానుగుణంగా కొన్ని మార్పులు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాంటి మార్పులు మంచివి అయితే ఆహ్వానించదగ్గవే. కానీ సమాజానికి హాని చేసే మార్పులయితే నిరోధించవలసిందే. సినిమాలలో అశ్లీల, భయానక దృశ్యాలను, సంభాషణలను నిరోధించడానికి సెన్సార్ బోర్డు అంటూ ఉంది. నాటక రంగానికి ఆ సౌకర్యం లేదు. అందువలన ‘ చింతామణి ’ లాంటి నాటకాల్లో అవాంఛితమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అలా ప్రదర్శిస్తున్న నాటక సమాజాల మీద చర్యలు తీసుకోవచ్చు. అటువంటి దృశ్యాలను, సంభాషణలను తొలగించే చర్యలను చేపట్టవచ్చు. అంతేగానీ సమాజహితాన్ని కోరే సాహిత్యాన్ని, వాటి ప్రదర్శనలను నిషేధించడం సమంజసం కాదు. అంతకంటే ఎక్కువ అశ్లీలం, అసభ్యత, అభ్యంతరకరమైన కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రస్తుత సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటిని ముందు నిరోధించగలిగితే సమాజానికి మేలు చేసినవారవుతారు.
.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.

కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao