10_008

ప్రస్తావన

సుమారు ఏడు నెలల తరువాత మళ్ళీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఒక ప్రక్క కోవిడ్ – 19 రెండవ దశ ప్రారంభం అయిందనే వార్తలు భయపెడుతున్నా అంతకంటే ఎక్కువగా జీవితం భయపెడుతోంది. అందుకే కరోనా భయాన్ని కాస్త ప్రక్కకు పెట్టి తమ తమ కార్యకలాపాలను కొనసాగించడం ప్రారంభించారు. అయినా జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి. జాగ్రత్తలే మనకి శ్రీరామరక్ష.

పాఠశాలలు, కళాశాలలు కూడా తెరుచుకుంటున్నాయి. బయిటకు వెళ్ళే పిల్లలకు కోవిడ్ జాగ్రత్తలను తెలియజేయవలసిన ఆవశ్యకత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతైనా ఉంది. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు నిబంధనల నడుమ గడపవలసిన పరిస్థితి ఈ కరోనా కల్పించింది. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం గనుక ఈ పరిస్థితికి తల ఒగ్గవలసిందే. ఎంతటి వాళ్ళకైనా తప్పదు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండవలసిందే !

ఆహారం, విద్య, వైద్యం దేశంలోని ప్రతి పౌరునికీ తప్పనిసరిగా అందాలి. వీటిని కనీస అవసరాలుగా గుర్తించి కొన్ని దేశాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. మనిషి జీవికకు ఆహారం తప్పనిసరి అవసరం. ఆ ఆహారాన్ని పండించే రైతు సంక్షేమం ప్రతి ప్రభుత్వ విధి. కొన్ని దేశాలలో వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.

అలాగే కొన్ని దేశాలలో విద్య అందరికీ తప్పనిసరి. మరికొన్ని దేశాలలో విద్యను ఉచితంగా అందిస్తున్నారు. విద్య ప్రయోజనాన్ని ఆయా దేశాలు గుర్తించాయి. అందుకే ప్రథమ తాంబూలం ఇచ్చాయి.

ప్రస్తుతం చాలా దేశాలలో వైద్యం వ్యాపారంగా మారిపోయింది. మనదేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలకు ఇది ఎంతమాత్రం మంచిది కాదు. కొన్ని దేశాలు ఈ విషయాన్ని  గ్రహించి వైద్య సేవలను ఉచితంగా లేదా చౌకగా అందిస్తున్నాయి. మన ప్రభుత్వాలు, వాటిని నడిపే నాయకులు ఈ మూడిటి విషయంలో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ప్రక్కకు పెట్టి దేశ ప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలి. అప్పుడే ఈ అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది. ప్రజలు కూడా అనవసర సంక్షేమ పథకాలు కాకుండా ఈ విషయాలను పట్టించుకునే వారినే ప్రభుత్వంలోకి పంపించాలి. అదే నిజమైన ప్రజా సంక్షేమం…. దేశ సంక్షేమం.    

*********************************

కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subcribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

          

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )  

or Click here –> paypal.me/sirarao

********************************************************

**********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో