ప్రస్తావన
‘ సహకారం ’ – కొంతకాలం క్రితం వరకు చాలా తరుచుగా వినిపించిన పదం. పరస్పర ప్రయోజనం, సహాయం అవసరమైన వారికి చేయూతనందించడం వంటివి ఈ పదానికి ఉన్న అర్థం లో ఇమిడి ఉన్నాయి.
1876 వ సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ లో వచ్చిన ‘ మద్రాసు కరువు ’ సుమారు కోటిమంది వరకు ప్రజలను బలి తీసుకుంది. ఈ పరిస్థితిని గమనించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇటువంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో ఒకటి 1892 లో ఏర్పాటు చేసిన ‘ కరువు విచారణ సంఘం ’. ఈ సంఘం చేసిన సుదీర్ఘ విచారణ అనంతరం సమర్పించిన నివేదిక 1904 వ సంవత్సరంలో సహకార ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆ సంఘంలో సభ్యుడిగా ఈ ఉద్యమ రూపకల్పనకు ప్రధానమైన వ్యక్తి అప్పటి మద్రాసు కలెక్టర్ గా పనిచేసిన సర్ ఫ్రెడ్‌రిక్ నికల్సన్. ఆ ఉద్యమం వ్యవసాయ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు ఏర్పాటుకు దారి తీసాయి. తర్వాత ఈ ఉద్యమం మరిన్ని రంగాలకు విస్తరించింది.
ఈ సహకార సంఘ స్వరూపం – ఒక రంగానికి లేదా ఒక వృత్తికి చెందిన కొంతమంది కలిసి తమ అవసరాలను, ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర్య సంస్థ. వ్యవసాయ రంగంలో సహకార సంఘాలు బాగా విస్తరించాయి. చిన్న చిన్న పల్లెటూర్లలోని రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడి ఆదుకున్నాయి.
మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందరే ఈ సహకార ఉద్యమం ప్రారంభమైనా స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వేగంగా దేశమంతా విస్తరించింది. వ్యవసాయ రంగంతో బాటు ఇతర రంగాలలో కూడా తనదైన ముద్ర వేసింది. 1946 లో ఏర్పడిన గుజరాత్ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం సాధించిన విజయమే సహకార సంఘాల విజయానికి మచ్చు తునక. ‘ అమూల్ ’ పేరుతో ఎంతగా విస్తరించిందో మనకందరికీ తెలుసు. అలాగే చాలా రాష్ట్రాలలోని పాల ఉత్పత్తి సింహభాగం సహకార సంఘాల చేతిలోనే ఉంది. ఎన్ని ప్రైవేట్ డైరీ లు వచ్చినా సహకార సంఘాల ప్రాభవం తగ్గలేదు. అయితే చేనేత సహకార సంఘాలు మాత్రం తమ మనుగడకు శ్రమ పడవలసి వస్తోంది.
ఇక గృహ నిర్మాణ రంగంలో కూడా సహకార సంఘాలు ఏర్పడి సభ్యులకి ప్రయోజనం కల్పిస్తున్నాయి. ఇలా ఇంకా చాలా రంగాలకు విస్తరించాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో సహకార ఉద్యమం బాగా విస్తరించింది. ఆంధ్ర ప్రాంతంలో తొలిరోజుల్లో కృష్ణా సహకార సంఘం ఏర్పాటుచేసి భోగరాజు పట్టాభిరామయ్య గారు సహకార ఉద్యమానికి ఊతమిచ్చారు. తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్య, హైదరాబాద్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారెందరో ఈ ఉద్యమ వ్యాప్తికి తీవ్రంగా కృషి చేశారు. ఇలా దేశమంతా విస్తరించి ఎందరికో ప్రయోజనం చేకూరుస్తున్న ఈ ఉద్యమం ఇటీవలి కాలంలో కార్పొరీకరణ నేపథ్యంలో కళ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు మేలుకుని జాగ్రత్త వహించి వీటిని కాపాడుకోకపోతే తమ భాగస్వామ్యంతో ఏర్పడి ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న సహకారరంగం నిర్వీర్యమైపోతుంది.
***********************************************
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –
- ‘ అభిజ్ఞ ’ మిత్రబృందం – అక్టోబర్, 2020 – ₹. 10,000/-
- శ్రీమతి కాంత గుమ్ములూరి, ముంబయి – రెండు సంవత్సరాలు – ₹. 1000/-
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో
$. 15. ; జీవిత కాలం : భారతదేశంలో ₹. 10,000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subcribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
****************************************************************************************
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
*********************************************************************************************
**********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…