13_002 ఆనందవిహారి

 

పాత కెరటాలు

నవలల అవలోకనం

 

 

తను కృషి చేసి తెలుసుకున్న మంచి విషయాలను నలుగురికీ పంచాలనుకున్న సంకల్పానికి ఫలితమే మాలతీ చందూర్ “పాత కెరటాలు” అని ప్రొద్దుటూరులో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న అవధానం అమృతవల్లి కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అంతర్జాలం ద్వారా ఆగష్టు 12వ తేదీ శనివారం సాయంత్రం ప్రసారం చేసిన “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో ఆమె “పాత కెరటాలు” నవలల అవలోకనం” అంశంపై ప్రసంగించారు. అప్పట్లో ఆంగ్లంలో ప్రసిద్ధి పొందిన ప్రపంచ రచయితల నవలలను విస్తృతంగా చదవడమే కాక దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నలుగురికీ మంచి విషయాలు తెలియపరచాలన్న సత్సంకల్పంతో…. 1950 నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు “స్వాతి” మాసపత్రికలో “పాత కెరటాలు” పేరిట ప్రసిద్ధి పొందిన ఆంగ్ల సాహిత్యాన్ని మాలతీ చందూర్ తెలుగు పాఠకులకు పరిచయం చేశారని వక్త గుర్తు చేశారు. వాటిలో ఉన్న లాలిత్యం, విషయం, అప్పటి సమాజపు తీరుతెన్నులు, యుధ్ధ వాతావరణం, ప్రజల మనోభావాలు, సైనికుల మనోగతం, పరిణామాలు, పర్యావరణం, క్లిష్ట సమయాల్లో కొందరి ఆలోచనా తీరు వంటి ఎన్నెన్నో విషయాలు మనల్ని అబ్బుర పరుస్తాయని చెప్పారు. అవి ఆలోచింపజేస్తాయి, కుదిపేస్తాయి, కొన్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తాయని వ్యాఖ్యానించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని సామాజిక పరిస్థితులు మారకపోవడం విస్మయానికి గురి చేస్తుందని, స్వార్థ శక్తులు ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆ నవలలలోని కథలు తేటతెల్లం చేస్తాయని అన్నారు. మాలతీ చందూర్ మూడు వందలకు పైగా చేసిన ఈ పరిచయాల వ్యాసాలలో కొన్నిటిని వివరించారు. 

పర్యావరణం విషయంలో గట్టి హెచ్చరికగా “బర్డ్స్” (డా. డి. మారియర్ రచన), సాధారణంగా కనిపించేవారు విపత్కర పరిస్థితుల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదగగలరని చెప్పే “ద మూన్ ఇజ్ డవున్” (జాన్ స్టెయిన్ బక్), పిల్లలకు బోధించే నీతులు ముందు పెద్దలు పాటించాలనే “వైట్ ఫాంగ్” (జాక్ లండన్), పురస్కారాలెన్నో పొందిన, పిల్లల పాఠ్య పుస్తకాలలో చోటు చేసుకున్న, సినిమాగా కూడా తీయబడిన “టుకలే మాకింగ్ బర్డ్” (హార్బర్ లీ), బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బతకవలసివచ్చేవారి జీవితాలకు ఉదాహరణగా “ఐ లివ్ ఓవర్ ద వాల్” (మోనికా వాల్డ్ విన్) కథలను తనదైన వ్యాఖ్యానంతో వివరించారు. 

పిల్లలు అడిగే అనేక ప్రశ్నలకు సవ్యమైన రీతిలో ఓపికగా సమాధానాలు చెప్తే వారిలో పరిశీలనా శక్తి, నిజాన్ని త్వరగా గ్రహించే తత్వం పెంపొందుతాయని “టుకలే మాకింగ్ బర్డ్” కథా సందర్భంగా అమృతవల్లి పేర్కొన్నారు. “వైట్ ఫాంగ్” అనేది బాల్యం నుంచే అష్టకష్టాలు పడిన రచయిత జాక్ లండన్ జీవితం ఆధారంగా రాయబడినది చెప్తూ, ఆయన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

కార్యక్రమం మొదట్లో తెలుగు వెలుగు సాహిత్య జాతీయ తెలంగాణ అధ్యక్షురాలు నవనీతా రవీందర్ వక్తను పరిచయం చేస్తూ…. ఆమెలో సహజ కవయిత్రే కాక ఒక సమాజ సేవకురాలు కూడా దాగి ఉందని వ్యాఖ్యానించారు. 

 

ఈ కార్యక్రమం వీడియో…..

 

వాగ్గేయకారోత్సవం

– 2023

 

జూన్ 3, 2023 వ తేది, స్థిర వారం శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో, తెలుగు సాంస్కృతిక సమితి ( హ్యూస్టన్ ), వంగూరి ఫౌండేషన్, స్వర భారతి మరియూ భారతీయవాహిని సంస్థలు సంయుక్తం గా నిర్వహించిన వాగ్గేయకారోత్సవం ఆద్యంతం అద్భుతం గా జరిగింది. సుమారు 60 మంది సంగీత సాహిత్య  కళాకారులు పాల్గొని ఆహూతులను ఎంత గానో అలరించారు. ఈ కార్యక్రమం హ్యూస్టన్ సంగీత సాహిత్య ప్రియులకు మండు వేసవి లో మలయమారుతం. ఆ రోజు ఉదయం 10 గంటల కు శ్రీ దశిక నరసింహం, శ్రీమతి భారతీ దంపతులు, కాంత్ & శ్రీదేవి జోస్యుల దంపతులు, శ్రీమతి ఆశా జ్యోతి ( TCA  అధ్యక్షురాలు ) దీప ప్రజ్వలన తో, దేవాలయార్చకులు శ్రీమాన్ తిరుమలాచారి గారి వేదం ఆశీర్వచనం తో మొదలైన ఈ కార్యక్రమం లో TCA  అధ్యక్షురాలు శ్రీమతి ఆశాజ్యోతి   గారు స్వాగత వచనాలు పలికారు. అనంతరం వాగ్గేయయకర వైభవం అనే శీర్షికన శ్రీమతి జోస్యుల శ్రీదేవి నిర్వహణలో జరిగిన గోష్టి గానం శ్రోతల లో భక్తి పారవశ్యాన్ని కలిగించింది. ఈ బృందం వారు ప్రసిద్ధ వాగ్గేయకారుల ( అయిదు మంది ) రచనలను ఎంచుకొని ఆలపించడం జరిగింది. ఆ సంకీర్తనలు వరుస గా, శ్రీ సకల గణాధిప – శ్రీ మంగళపల్లి బాలమురళీకృష్ణ , నారాయణాచ్యుత – అన్నమాచార్య, రాముని భజన సేయవే – కైవార యోగి నారాయణ, ఏహి ముదం దేహీ – నారాయణ తీర్థులు, దేవదేవం – నారాయణ తీర్థులు, కలశా పురము కాడ –  అన్నమాచార్య , మరియు రామ సీతారామ – భద్రాచల రామదాసు. ఈ బృందం లో శ్రీమతులు గాయత్రి అవధానుల /ముళ్ళపూడి, హిమబిందు పొన్నపల్లి, అపర్ణ గంటి, లక్ష్మి ముక్కవిల్లి, హేమ నళిని అక్కిరాజు, శిరీష పిల్లలమఱ్రి, ఇందిరా విజయ్, జ్యోతి వెంకటేశన్, అను గన్నవరపు, శ్రీ గౌరీ అంబటిపూడి, శ్వేత రాచమడుగు, స్మిత ప్రహ్లాద్, స్వప్న నీలం, సుమన అక్కినపల్లి, లలిత రాచకొండ, సుధారాణి సాంబరాజ్, డా. జ్యోతి రావు, డా. మల్లిక మరియూ డా. స్రవంతి కోరుమిల్లి, కుమారీలు – మేఘన కర్రా, అలేఖ్య సాంబరాజ్, శ్రీ సంహిత పొన్నపల్లి, ఆశ్రిత మున్నగు వారు పాల్గొన్నారు. ముకుంద్ జోస్యుల, తేజస్ మురళి వయోలిన్ పైనా, నారాయణ్ శ్రీనివాసన్ మరియూ దత్త ముళ్ళపూడి మృదంగం పైనా సహకరించారు. శ్రీ దశిక నరసింహం గారు వాగ్గేయకార వైభవం బృందాన్ని అభినందిస్తూ చేసిన ప్రసంగం తో వాగ్గేయకార వైభవం గోష్టి గానం ముగిసినది.

తదుపరి హ్యూస్టన్ నగర పరిసర ప్రాంతాల నుండి పలువురు సంగీత గురువులు వారి వారి శిష్యుల చేత అన్నమాచార్యులు, భద్రాచల రామదాసు, తూము నరసింహ దాసు, త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, నారాయణ తీర్ధ, శ్రీ ఈమని శంకర శాస్త్రి,  శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ మున్నగు ప్రసిద్ధ వాగ్గేయకారుల సంకీర్తనలు గానం చేయించారు. సంగీత గురువులు శ్రీ కుమరేష్ రాజ గోపాలన్, శ్రీదేవి జోస్యుల, దీప రామచంద్రన్, అపర్ణ గంటి, శార్వాణి ధూళిపాళ, జ్యోతి వేంకటేశం, రాజ రాజేశ్వరి భట్,  శ్రీ మహేష్ అయ్యర్, శ్రీ శంకర్ అయ్యర్, శ్రీ పార్థు నేమాని (ఇండియా), శ్రీ రాజశేఖర్ ఓరుగంటి (ఇండియా), శ్రీ కైవల్య చిల్లా (ఇండియా), అంజన, రాధికా ధనేష్ మున్నగు వారు. సుమారు 5 గంటలపాటు సాగిన ఈ సంకీర్తనా యజ్ఞం లో సంగీత విద్యార్థులందరూ మిక్కిలి భక్తి శ్రద్దల తో వాగ్గేయకారులకు నివాళులర్పించారు.  

ఈ కార్యక్రమం లో శ్రావిక తిరునగరి, హంసిక అయపిల్ల, కోవిద కొత్త, ప్రాణిక తిరునగరి, అన్విత వడ్ల, ప్రణవి వేదుల, అనిషా అయిలవరపు, శ్రావ్య వేదుల, అన్వి భట్, భావిని రామ్, రిషిక్, రియాన్స్ కోరుమిల్లి, సంజీవ చిక్కాల, సామర్థ్ శిష్ట, సుహృత్ రావ్,  శ్రీసంహిత పొన్నపల్లి, కావ్య హరిక్రిష్ణన్, నిఖిల్ భరధ్వాజ్, ధృవ్ రాజేష్, షాలిని, లక్ష్మి, సాత్విక్, శ్రీవల్లి, మీనాక్షి, సుశాంత్, అర్జున్, కృతిక, శ్రావ్య, లాస్య, ప్రతీక్ ముక్కవిల్లి, రాజేశ్వరి ప్రియా సుబ్రహ్మణ్యం, అపర్ణ గంటి   మున్నగు వారు వారి గాత్రం తోనూ, అనన్య ప్రభు, అన్నపూర్ణ గణేష్,  తేజస్ మురళి,  కార్తీక్ ముక్కవిల్లి, ప్రణవ్ ప్రవీణ్ వయోలిన్ తోనూ, నారాయన్ శ్రీనివాసన్, దత్త ముళ్ళపూడి మృదంగం తోనూ శ్రోతలను అలరించారు.

అనంతరం వర్ధిష్టు కళాకారుల చే జరిగిన మూడు లఘు కచేరీలు శ్రోతల మన్ననలను పొందాయి. ముందుగా కుమారి. మాళవిక పిళ్ళై వేణు గాన కచేరి ప్రతిభావంతం గా సాగి రసజ్ఞుల మెప్పును పొందింది. చి. ప్రణవ్ ప్రవీణ్ వాయులీన కచేరి శ్రోతలకు వీనుల విందు చేసింది. తదుపరి గాయత్రీ నటరాజన్ వీణ వాదనం సంగీత ప్రియులను యెంత గానో అలరించింది. వీరిరువురికీ, శ్రీ ముకుంద్ జోస్యుల ( వయోలిన్ ) మహేశ్వర్ అజయ్ ( మృదంగం ), విశాల్ సెట్లూర్ ( మృదంగం ) పై చాలా చక్కగా సహకరించారు.

పై కార్యక్రమాలన్నింటికీ, శ్రీ కాంత్ జోస్యుల, శ్రీమతులు హిమ బిందు పొన్నపల్లి, శ్రీదేవి  జోస్యుల, గాయత్రీ ముళ్ళపూడి/అవధానుల మున్నగువారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శ్రీయుతులు మల్లిక్ పుచ్చా, ప్రభు నారుమంచి, కాంత్ జోస్యుల, శ్రీమతులు ఇందిరా చెరువు, భారతి దశిక గార్లు సంగీతోపాధ్యాయులను సముచితం గా సత్కరించి విద్యార్థులకు జ్ఞాపికలను బహుకరించారు.

సాయంత్రం ఈ వాగేయకారోత్సవం లో ఆఖరి కార్యక్రమమైన స్వర వీణా పాణి గారి సంగీత సాహిత్య అవధానం ఒక ప్రత్యేక ఆకర్షణ.  

సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ ఉత్సవానికి ఎంతోమంది విజ్ఞులు తమ హార్దిక, ఆర్ధిక సహాయాన్ని అందించారు. అరవింద్ & సుధా, రవికాంత్ & బిందు, సీతారామ్ & ఉష అయ్యగారి, సుధేష్ & సంగీత పిల్లుట్ల, సాయి & లలిత రాచకొండ, చలపతి & హేమ నళిని అక్కిరాజు, చంద్ర & అను గన్నవరపు, శ్రీనివాస్ & సత్యమణి  ముళ్ళపూడి మున్నగు వారు.  

తెలుగు సాంస్కృతిక సమితి కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఆశాజ్యోతి ( అధ్యక్షులు ), శ్రీకాంత్ తిప్పారెడ్డి ( సాహితీ సమన్వయ కర్త ), రత్నాకర్, స్నేహరెడ్డి, శ్రీమతి ఇందిరా చెరువు గార్లు కార్యక్రమం ఆసాంతం ఉండి తమదైన రీతి లో వారి సహాయాన్నందించారు. 

 

***************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page