10_010

ప్రస్తావన

మరో సంవత్సరం కాలగర్భంలోకి జారిపోయింది. బహుశా 2020 లాంటి సంవత్సరాన్ని ఇంతకుముందెన్నడూ ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం దాదాపుగా 10 నెలలపాటు క్రొత్త అనుభవాలను అందించింది. భయపెట్టింది. పాతవైన కొన్ని క్రొత్త అలవాట్లను చేసింది. కట్టు తప్పిపోతున్న క్రమశిక్షణను మళ్ళీ కొంతమేరకైనా పునరుద్ధరించింది. నిజానికి 2020 మానవాళికి చేసిన చెడు కంటే మంచే ఎక్కువ ఉందేమో ! అయితే ఈ కరోనా భయం మాత్రం అనేక జీవితాలను అతలాకుతలం చేసింది. ఎందరో ఉపాధి కోల్పోయారు. ఉత్పత్తి ఆగిపోయింది. చాలా వ్యాపారాలు, వ్యవహారాలు ఆగిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే కొంతకాలం పాటు జనజీవనం స్తంభించింది. ప్రపంచమంతా ఒకటే జపం…. ‘ కరోనా ’.

‘ గతకాలం మేలు వచ్చు కాలం కంటెన్ ’ అన్న మాట ఇక్కడ తిరగబడిందేమో ! 2020 లో ‘ కరోనా ’ సృష్టించిన అలజడి, ఆందోళన 2021 లో సద్దుమణిగి ప్రజా జీవనం గాడిలో పడుతుందేమో కాలమే చెప్పాలి. అలా జరగాలని కోరుకోవడం సహజం. ఏమైనా ఈ సంక్షోభం నేర్పిన పాఠం నుండి చాలా నేర్చుకోవాలి. విచ్చలవిడితనం ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిది. రోగ నిరోధక శక్తిని సహజంగా పెంపొందించే మన ఆహార పదార్థాల విలువ ఇప్పటికైనా తెలుసుకోవడం అవసరం. ప్రపంచ దేశాలతో పోలిస్తే అధిక జనాభా ఉన్న భారతదేశంలో ఈ కరోనా ప్రభావం తక్కువ అనే చెప్పాలి. దానికి మన రోగ నిరోధక శక్తే కారణం. కొంతవరకైనా ఇది కాపాడింది. నిరర్థకమైన ఫాస్ట్ ఫుడ్స్ ని విడిచి పెట్టి, అధిక పోషకాలు, సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తిని అందించే మనవైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకుంటే ఇటువంటి వైరస్ లు ఎన్ని వచ్చినా మనం సమర్థంగా ఎదుర్కోగలం.

2020 లో చాలమందికి కొన్ని క్రొత్త అలవాట్లు వచ్చాయి. వాటిలో డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ క్లాసులు ముఖ్యమైనవి. బ్యాంక్ వ్యవహారాలు ఏమాత్రం తెలియని చిన్న చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. చీటికీ మాటికీ షాపింగ్ కి వెళ్ళి అవసరమున్నవాటితో బాటు అవసరం లేనివి కూడా కొనుక్కుని తెచ్చుకునే అలవాటుకు తాత్కాలికంగా తెర పడింది. అవసరమైనవి మాత్రమే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకునే అలవాటు బాగా పెరిగింది. విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు సరిగా హాజరు అవుతున్నారో లేదో, అయినా పాఠాల మీద శ్రద్ధ చూపిస్తున్నారో లేదో అనే ఒత్తిడి కొంతవరకు తల్లిదండ్రులకు దూరం అయింది. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసుల్లో చదువుకుంటుంటే ప్రత్యక్ష పర్యవేక్షణకు వీలు కలిగింది. అయితే అవకాశమున్నా కొంతమంది అతి నమ్మకంతో పర్యవేక్షణా లోపం వలన అంతర్జాలం పిల్లలకి కొంత చెడు చేస్తోంది. కాబట్టి ఇంట్లోనే ఉన్నారు కదా అని ఊరుకోకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం.

ఈ క్రొత్త సంవత్సరం మరింత క్రొత్తగా క్రొత్త వైరస్ లను మోసుకురాకుండా, వచ్చినా తట్టుకునే శక్తిని అందించి, ప్రజా జీవనం సాఫీగా, ప్రశాంతంగా సాగేలా చేస్తుందని, ఉపాధి కోల్పోయిన వారికి మళ్ళీ ఉపాధి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి అవి తీరేలా చేస్తుందని ఆశిద్దాం.  

**********************************************************


కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవిత కాలం :

భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subcribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

 

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

**********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో