తత్వ చింతన – త్యాగశీలత
మార్గ కవులు, దేశి కవులు అని రెండు సారస్వత మార్గాలు ఉన్నాయి. ఈ ధోరణుల్లో అవస్థా బేధాలు అనేకం ఉంటాయి. కావ్యం ఎటువంటిది అంటే అది ఒక ఫలం. కవిత్వం ఎటువంటిది అంటే ఆ పండు యొక్క రుచి అన్నమాట. దేశి కవిత పెరటి బావి నీరు వంటిది. మార్గ కవిత పుణ్యతీర్థ పుష్కరిణిలోని నీటి వంటిది. లోతుగా ఆలోచిస్తే ప్రవాహము ఉన్నచోట బావులు పరిగణన లోకి రావు. ఎన్ని బావుల్లో నీరు తాగినా, జీవనదిలో మునగనిదే జీవితానికి పరమార్థకత లేదు… చరితార్థకత లేదు. దేశి కవితలో పాట జీవన రాగాన్ని వినిపింపజేస్తే, సంప్రదాయ మార్గ కవితలో ఉండేటటువంటి కవిత ప్రగతిని, సంస్కృతీ వైభవాన్ని మన మేధకు పట్టిస్తుంది.
ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.