10_017 సుమాంజలి

.

[ ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం స్వర్గస్థులైన నవనిధి ఎలక్ట్రానిక్స్, హైదరాబాద్ అధినేత, అమలాపురం ASN.కళాశాలల  Chief Patron, కళా పోషకులూ అంతకు మించి గొప్ప మానవతావాది బ్రహ్మశ్రీ యేడిద రామనాధ శాస్త్రి గారికి శ్రద్ధాంజలి. ]

.

కీర్తిశేషులు శ్రీ ఏడిది రామనాధ శాస్త్రి గారికి సుమాంజలి

వేదమూర్తులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి మంగమ్మల పుణ్యఫలం,

ఏడిది వారింట పండింటి రామనాధ శాస్త్రి జననం.

.

అమ్మచేతి మిఠాయి తాయిలాలు,

నాన్న చెప్పిన భారత రామాయణాలు.

ఆరేసిన బట్టతో సహపంక్తి భోజనాలు.

మది నిండా ఆ జ్ఞాపకాలు నిత్య నూతనాలు.

.

కోనసీమ ఆభరణం శ్రీ భానోజి రామర్స్ కళాశాల ఆవరణం

ఉత్తమ శ్రేణి విద్యార్థులకు అధ్యాపకుల ఆదరణం

 ఇంజనీరింగ్ విద్యలో ఆరితేరిన పరిజ్ఞానం

అంతరిక్షంలో కెగిరిన ఇస్రో విజయకేతనం

.

ఇరవదయిదేండ్ల వయసులో ఏడడుగులు నడిచిన సొగసు

అందాల భరిణి, అనుకూలవతి మణికి అర్థభాగమిచ్చిన నిండు మనసు

అనంతుడా యింటి వంశోద్ధారకుడు

సునీత వారింటి మహాలక్ష్మి సురేష్ ని చేపట్టిన గృహాలక్ష్మి

.

శ్రీనిధి దేశ విదేశీ సాంకేతిక విజ్ఞాన నవనిధి

శాస్త్రి గారి చేతి రక్షాబంధనం దేశ రక్షణా ప్రభంజనం

దేశ రక్షణ పరికరాల తయారీకి జంటనగరాలలో స్థాపించిన నవనిధి

.

తండ్రి గారి జ్ఞాపకార్థం నెలకొల్పిన ఏ‌ఎస్‌ఎన్ మహిళా కళాశాలల పెన్నిధి

అధునాతన స్త్రీ విద్యను ప్రోత్సహించిన పురుష పుంగవులు

.

సంస్కృతీ సంప్రదాయాల అభ్యున్నతికై వేదసభలు

దేవాలయ ఆస్తుల పరిరక్షణకై తండ్రిగారి పేరున నిర్మించిన కళావేదికలు 

లలితా సంగీత లహరి పంచిన శాస్త్రీయ సంగీత మాధురి

.

గోరక్షణ అంటే ప్రాణం

వృద్ధులంటే అభిమానం

.

పదుగురు మంచి కోరు బ్రతుకు సుస్వర సంగీతం

పరమేశ్వరుని కృపతో కైలాస వాసం

భువిలో మీ కీర్తి అజరామరం

.

************************************************