10_004

ప్రస్తావన

సత్యమ్మునే అతడు పలికాడు !

సత్యాగ్రహమ్మునే సలిపాడు !

హింస రాక్షసనైజ మన్నాడు !

తా నహింసకే బ్రతుకు వెలబోశాడు !

( గాంధీ తాత – డా. వక్కలంక లక్ష్మీపతిరావు )

సత్యము, సత్యాగ్రహము, అహింస తన ప్రధాన సిద్ధాంతాలుగా భారతజాతిని ఒక్కత్రాటిపై నడిపి రవి అస్తమించని సామ్రాజ్యంగా తమని తాము వర్ణించుకుని వర్థమాన దేశాలను ఆక్రమించుకుని ఆయా దేశాల్లోని మానవ వనరులనే ఉపయోగించుకొని అక్కడి వనరులను కొల్లగొట్టి తమ దేశానికి తరలించుకుపోతున్న బ్రిటిష్ రాజ్యాన్ని భారత దేశం నుంచి తరిమి కొట్టడంలో ప్రధాన భూమిక వహించిన వ్యక్తి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.    

అతి సామాన్యంగా కనిపించే గాంధీ భారత జాతికి మాత్రమే కాదు. ప్రపంచానికే ఆదర్శవంతమైన మహాత్ముడిగా కీర్తించబడుతున్న వ్యక్తి. ఎన్నో దేశాలు గాంధీ బాటను, బోధనలను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా గాంధీ నిరసన మార్గంగా అనుసరించిన సత్యాగ్రహం ప్రపంచంలోని శాంతికాముకులను ఆకర్షించింది. నిజానికి గాంధీజీ జీవితానుభవాలనుంచి ఇప్పటి తరాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆయన గురించి తెలుసుకోవలసింది కూడా ఎంతో ఉంది.

తెలుగు భాష కు ఎనలేని సేవ చేసి, తెలుగు వారు గర్వంగా చెప్పుకునే ప్రముఖులు ఎందరో ఉన్నారు. వారిలో ఇప్పటి తరానికి చెందిన వారిలో ప్రముఖులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అసంఖ్యాకమైన అభిమానుల చేత ఎస్. పి. గాను, బాలు గాను పిలువబడే బాలసుబ్రహ్మణ్యం గారు అధిరోహించని శిఖరం లేదని చెప్పవచ్చు. కరోనా సంక్షోభంలోనూ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. జాగ్రత్తలు, హెచ్చరికలు చేస్తూ పాటలు పాడి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందించారు. ‘ మీరు కోరిన పాట ’ పేరుతో అభిమానులు అడిగిన పాటను ఫోన్‌లో పాడి వినిపించి, తద్వారా కొన్ని లక్షల రూపాయలు సేకరించి కరోనా నివారణ కోసం అందించారు. అటువంటి ఆయనే ఆ మహమ్మారి బారిన పడటం, దాని నుంచి బయిట పడినా మృత్యువు బారిని పడటం విషాదకరమైన విషయం. అయితే ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన పాట మనలోనే ఎప్పటికీ ఉంటుంది. మనకే కాదు… మన తర్వాత తరాలకు కూడా వినిపిస్తూనే ఉంటుంది. తద్వారా బాలు ఎప్పటికీ సజీవులే !    

కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన... చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –
  1. ‘ అభిజ్ఞ ’ మిత్రబృందం – జూలై, 2020 - ₹. 10,000/-
                                   - ఆగష్టు, 2020 - ₹. 10,000/-
  1. శ్రీ వై. రామకృష్ణ, చెన్నై - రెండు సంవత్సరాలు -  ₹. 1,000/-
  2. శ్రీ కె. వి. ఆర్. శర్మ, హైదరాబాద్ - రెండు సంవత్సరాలు - ₹. 1,000/-

వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో  ₹. 600/- విదేశాల్లో  $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో  ₹. 1000/- విదేశాల్లో  $. 15.

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis కు గాని, G. pay phone no. +91 9440483813 కి గాని పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు. – శిరారావు 

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

**********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో