11_012 బాలభారతి – ఆగండమ్మా ! చుక్కలూ ! February 15, 2022 ఆగండమ్మా ! చుక్కలూ !పయన మాపం డమ్మా చుక్కలూ !సరదాకబుర్లు మాతో చెబుతూసాగం డమ్మా ! అక్కలూ ! మేము నిదుర పోయేవేళా ! మీరు వచ్చి పోతుంటారు ! మేము నిదుర లేచేసరికే మీరు నిదుర పోతుంటారు ! సూర్యు డంటే మీకు భయమా ?చంద్రు డంటే మీకు ప్రియమా ?సూర్యుడు మి మ్మేం చేశాడు ?చంద్రుడు మీకే మిచ్చాడు ? పగ లంతా తెగ నిద్రపోయినా ఒళ్ళు బలవడం లే దేమీ ? రాత్రి మంచులో అలా తిరిగినా రొంప పట్టడం లే దేమీ ! నీలినీలిఆకాశపుతెరపైనిలిచీ నిలవనితారల్లారా !పరువము లొలికేనందనవనిలోవలపులు కులికే పువ్వుల్లారా ! అందీ అందని ౘందమామనే అందుకొనా లని చూస్తా రేమీ ? మీజత కోరేమమ్ము కా దని మింటిదారినే పోతా రేమీ ? మఱియొకతారను వలచినచంద్రునిమామా ! మామా ! అంటా రేమీ ?ఎవ్వతెకన్నులకాటుకనలుపోఈతనిమొగమున కనుగొన రేమీ ? ఆగం డమ్మా ! చుక్కలూ ! సరదాగా మామాటలు విని మఱి సాగం డమ్మా ! అక్కలూ ! ——- ( 0 )——– 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾