మిత్రులారా,
భారత దేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా మొదలైన అనేక దేశాలలో స్థిరపడిన కథకుల కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ గత ఏడాది మేము వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-15వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందింది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడు న్యూజీలాండ్ కేంద్రంగా జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా “డయాస్పోరా తెలుగు కథానిక-16వ సంకలనం” లో ప్రచురణకి విదేశాలలో నివసిస్తున్న రచయితల కథలు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
విదేశాలలో నివసిస్తున్న రచయితలకి మా విన్నపం, సూచనలు, నిబంధనలు.
- భారతదేశానికి వెలుపల నివసించే ప్రవాసాంధ్రులందరూ రచనలు పంపడానికి అర్హులే.
- ఒక్కొక్కరు ఒక కథ మాత్రమే పంపాలి.
- రచన సొంతమని, మరి దేనికీ అనువాదం, అనుసరణ కాదని హామీ పత్రం జతపరచాలి.
- రచనతో బాటూ ఒక ఫోటో, ఐదు-పది పంక్తులకి లోబడి క్లుప్తంగా తమ జీవిత వివరాలు పంపాలి.
- ఆయా దేశాల్లోని స్థానిక జీవితాల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, సమస్యల్ని ప్రతిబింబించే కథా వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానికులు అంటే ఆ దేశ జాతీయులు కానీ, అక్కడ నివసిస్తున్న భారతీయులు, తెలుగు వారి సమాజం, ఇతర దేశాల నుంచి అక్కడకి వలస వచ్చిన వారు… ఇలా ఆ దేశం లో నివసిస్తున్న ఎవరైనా కావచ్చును.
- అముద్రితమైన కొత్త కథలు, ఇటీవల ప్రచురించబడిన కథలు (2020 -2022) ఆహ్వానిస్తున్నాం. ముద్రించిన కథల ప్రచురణ వివరాలు తప్పకుండా తెలియ పరచాలి.
- కొత్త కథలకి మేము సూచించే కొన్ని ఇతివృత్తాలు: అమెరికాలోనూ, ఇతర దేశాలలోనూ ఇమ్మిగ్రేషన్ పోలిసీ ల వలన కుటుంబాల ఇబ్బందులు, చిన్న తనం లోనే అమెరికా వచ్చేసి, అమెరికాలోనే చదువుకుని యుక్త వయసుకు కి వచ్చిన వారు గ్రీన్ కార్డ్ రాక వెనక్కి వెళ్ళే పరిస్థితి (DACA-Deferred Action Childhood Arrivals), విడాకుల సమస్యలు, దారి తప్పిన పిల్లల సమస్యలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, ఇండియన్ బాస్ లకే పనిచేస్తున్న వాటిల్లో ఇబ్బందులు మొదలైన అనేక వృత్తులలో వర్క్ ప్లేస్ కథలు, వివక్ష, ఇతర దేశాలలో కూడా ప్రవాస తెలుగు భారతీయులలో పాతుకుపోయిన కుల వ్యవస్థ, విదేశాలలో స్వదేశాల రాజకీయాల ప్రభావం, పర్యావరణం కథలు, సైన్స్ ఫిక్షన్, సాంస్కృతిక వైరుధ్యాలు, దేశాభిమానం, దురభిమానం కథలు—-ఆయా సమస్యల లోతులు, పరిష్కారాలు…ఇలా విదేశీ రచయితలకి అందుబాటులో ఉన్న ఎల్లలు లేని భావ స్వాత్యంత్ర్యం, ప్రకటన, విస్తృతమైన వస్తు వైవిధ్యం—-అతి పెద్ద కేన్వాస్…
- రచనలు వర్డ్/గూగుల్ డాక్యుమెంటుగా మాత్రమే పంపాలి. చేతివ్రాత, JPEG, తదితర ప్రక్రియలు ఆమోదయోగ్యం కాదు.
- కథల నిడివి సుమారు 2500 -3000 పదాలకి మించకూడదు.
రచనలు చేరవలసిన ఆఖరి తేదీ- జూన్ 30, 2022 (June 30, 2022)
రచనలు పంపించవలసిన చిరునామాలు
vangurifoundation@gmail.com, rayavaramb@gmail.com, sairacha@gmail.com
లేదా
వాట్సాప్: 1 832 594 9054
వివరాలకి సంప్రదించవలసిన సంపాదకులు
వంగూరి చిట్టెన్ రాజు ( వాట్సాప్: 1 832 594 9054); శాయి రాచకొండ (వాట్సాప్: 1 281 235-6641), భాస్కర్ రాయవరం (1 469 877 9235)
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾