13 వ మేళకర్త రాగం గాయకప్రియ జన్యం. చాలా కష్టం, అయినా వినటానికి సరళముగా ఉండి, పేరుకు తగినట్టే గాయకులకు ప్రియమైన జనకరాగం లోంచి పుట్టిన, కమ్మని కష్టమైన రాగం జుజాహుళి. కృతిలో వెల్లడించిన భావోద్వేగపు ఒరవడిని తట్టుకో గల రాగం. త్యాగయ్య గారి విద్వత్తుకు అసలైన సిసలైనమచ్చుతునక.
రాముడి పైనే రాసిన, ఈ జుజాహుళి రాగ కీర్తనలో త్యాగరాజుగారు రామనామాన్ని ఒక్కసారి కూడా పలకరు. కొన్ని సార్లు భక్తులు భగవంతుడిమీద అలిగి నిందస్తుతి చేసినట్టు. ఇందులో నిందలేకపోయినా రాముడికి వేర్వేర పేర్లతో బ్రతిమాలటం ఆసక్తికరంగా ఉంటుంది.
పల్లవి
పరాకు చేసిన నీకేమి ఫలము కలిగెరా పరాత్పరా
అనుపల్లవి
సురావనా సురాప్తమా
వరా జరాపఘన నాయెడా
చరణం
ముదాన నీదు పదారవిందమును బట్టి మ్రొక్కగలేదా
నిదానరూపా దరిదాపుతేజా
ఉదారశ్రీ త్యాగరాజనుత
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page