10_010 పండగ రావాలి

.

పండగ రావాలి !

.

ఆదిత్యుడు తన కిరణాలను పదునెక్కించుకొనేందుకు ఉత్తరాయణానికి ఆయత్తమవుతున్నాడు.

హేమంతం తన చలి తలంపుని తనలోనే దాచుకొని బిరబిరమంటూ హిమవన్నగాలలో తలదాచుకుంది.

.

ఇళ్ళముంగిట్లో భోగిమంటలొక పక్క

భోగంచేయించుకుంటున్న శ్రీనివాసుడు, పాశురాలకి పరవశించిన

అమ్మ పౌష్యలక్ష్మి గోదాదేవిల మందస్మితాలొక పక్క,

.

పరమశివునికి క్షీరాభిషేకములొక పక్క

నారాయణ స్మరణలతో హరిదాసులొక పక్క,

.

పంట చేతిలోపడ్డ రైతన్నల చిరునవ్వులొక పక్క,

వనదేవత చేమంతుల, బంతుల మరువపు సౌగంధములతో సింగారమొక పక్క,

.

గోమాతలని కొలిచే భక్తులొక పక్క,

తీర్చిదిద్దిన రంగవల్లులతో రూపుమార్చుకొన్న భూమాత ఆనందం ఆవర్ణమొకపక్క

.

కొత్త అల్లుళ్ళకి ఆతిధ్యపు ఆర్భాటములొక పక్క,

పల్లెసీమల్లో నైవేద్య భోజ్యములు స్వీకరిస్తు దీవెనలిస్తున్న గ్రామదేవతలొక పక్క

.

కమ్మని పిండివంటల ఘమఘమలతో

అసలైన నిజమైన పండగ రావాలని ఆశతో !

.

****************************************