11_014  బాలభారతి – ఆంతర్యాలు

 

నిలువు నిలువునా యెండ కెండుతూ

నీడను ఇచ్చే చెట్టుంది !

పరోపకారముకోసము బ్రతికే

వారిబ్రతు కిలా ఉంటుంది !

                                    వాడిపోయినా బొగడపూలలో

                                    పరిమళ ముంటుంది !

                                    తనువు పోయినా మహానుభావుల

                                    ఘనయశ ముంటుంది !

గరకుగ తోచేపనసపండులో

తరగనంత మధు వుంటుంది !

కఱకుగ పలికేపెద్దమనిషిలో

తీయ నైనమన సుంటుంది !

                                    ఇంపుగ ఉండేమేడిపండులో

                                    ఎన్నో పురుగులు ఉంటాయి !

                                    పైకి తీయగా పలికేవానికి

                                    స్వాంతములో చే దుంటుంది !

సృష్టిలోనియేవస్తువుకైనా  

రెండురూపములు ఉంటాయి !

వ్యక్తులపైపైవాటము చూడక

ఆంతర్యమునే చూడాలి !

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com