10_016 – ప్లవ ఉగాది సంచిక

. పాఠకులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రకటనదారులకు…. అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో…..

.

ప్రస్తావన

.

కరోనాతో సహజీవనంలో రెండవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము. ‘ ప్లవ ’ అంటే ‘ తెప్ప ’ అని అర్థం చెబుతున్నాయి నిఘంటువులు. ‘ తెప్ప ’ అంటే చిన్నపాటి పడవ వంటిది. కాలువలు, సెలయేరులు, చెరువులు, చిన్న చిన్న నదీప్రవాహాలు మొదలైనవి దాటడానికి ఉపయోగించే సాధనం ‘ తెప్ప ’. అంటే మనల్ని ఆ నీటి ప్రవాహాన్ని దాటించి ఈ వడ్డు నుంచి ఆ వడ్డు కి చేరుస్తుందన్నమాట. అలాగే ప్రవాహ వేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా అనే మహమ్మారిని ఈ ప్లవ నామ సంవత్సరమనే తెప్ప దాటిస్తుందని ఆశిద్దాం.

గత సంవత్సరం ఈ మహమ్మారి కారణంగా ప్రజాజీవనం దాదాపుగా స్తంభించిపోయింది. ఇంతకాలం ఎప్పుడూ ఇలా స్తంభించలేదేమో ! కర్ఫ్యూ వంటివి పెట్టినా రోజుల వరకే ఉండేవి. అది కూడా సంస్య ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. మొత్తం దేశమంతా నెలలతరబడి స్తంభించిన దాఖలాలు ఎక్కడా కనబడవు. దీనివలన దైనందిన జీవనం అగమ్యగోచరం అయింది. చాలా రకాలైన కార్యకలాపాలు ఆగిపోయాయి. కరోన వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం వ్యవహరించి లాక్ డౌన్ ప్రకటించి చాలా సమర్థవంతంగా నిర్వహించిందనే చెప్పాలి. దానికి ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. దాంతో మహోగ్రరూపం దాలుస్తుందని వేసిన అంచనాలు పూర్తిగా సఫలం కాలేదు. కొద్దిరోజులు విజృభించిన కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నెమ్మది నెమ్మదిగా అన్ని కార్యకలాపాలు సాధారణ స్థాయిలోకి వస్తున్నాయి. ఈ తరుణంలో కరోనా రెండవ దశ ప్రారంభమైంది. ఎప్పటిలాగే ఈ రెండవ దశ కరోనా పైన రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏవి నమ్మాలో, నమ్మకూడదో తెలియని పరిస్తితి.

ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ రక్షణే శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈసారి దేశమంతా లాక్ డౌన్ సాధ్యం కాకపోవచ్చు. క్రిందటి సంవత్సరం తీసుకున్నంత జాగ్రత్తలు ఈసారి ప్రభుత్వం గాని, ప్రభుత్వ వర్గాలు గాని తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఆ నియమాలు, నిబంధనలు ఎల్లకాలం మానవాళికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అందుకే ప్రభుత్వం నిర్బంధం పెడుతుందని, అప్పటివరకూ మనం జాగ్రత్తలేవీ పాటించకుండా బయిట తిరుగుదామని అనుకోవడం మనకి మనం కీడు చేసుకోవడమే ! స్వీయ నియంత్రణ కోసం నిర్దేశించిన మూడు నియమాలను పాటిస్తుంటే కొంతవరకైనా వ్యాప్తిని అరికట్టవచ్చు. బయిటకు వచ్చినపుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవడం, ఇతర వ్యక్తుల నుంచి కనీస దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించినపుడే కరోనాని కొంతవరకైనా నియంత్రించడం సాధ్యమవుతుంది. అది ప్రభుత్వాలో, మరెవరో చెబుతారని ఎదురు చూడటం విపత్తు ను కోరి ఆహ్వానించడమే అవుతుంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటూ కరోనా వ్యాప్తిని నియంత్రిద్దాం. వాక్సిన్ మాత్రం తప్పనిసరిగా వేయించుకోవాలి. 

‘ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి….. ’ అన్నట్లు ఆ మహమ్మారి మనదాకా వచ్చాక మనకోసం ఎవరూ రారు. అది గుర్తు పెట్టుకుని జాగ్రత్త పడటం మనకే మంచిది.     

.

********************************************

.కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ఇప్పటికే ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… క్రొత్తగా చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –

20. శ్రీమతి శ్యామల చెళ్ళపిళ్ల, విజయనగరం – ఒక సంవత్సరం – ₹. 600/-

.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subscribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

.

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో