Poet

13_007 సాక్షాత్కారము 10

కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!

13_006 సాక్షాత్కారము 09

ఎన్నో బెజ్జము లున్న తనువులో
గాలి నిలుచుటే ఆశ్చర్యం!
గాలిబ్రతుకు లివి రాలిపోవడం.
కానేకా దిది ఆశ్చర్యం!!

13_005 ద్విభాషితాలు – వివశం

అమెరికన్ కవి అయిన Robert Frost కవిత… Stopping by the Woods on a Snowy Evening ఈ “వివశం” కవితకు స్ఫూర్తి! సౌందర్యాస్వాదనకు…. బాధ్యతా నిర్వహణకు మధ్య..మనిషి పడే సంఘర్షణ ఇందులో ప్రధానాంశం.

13_004 సాక్షాత్కారము 07

చావు ముంచుకొని వచ్చిన
జీవుల కిక భయ మెక్కడ ?
నిరాశ నిండినదీనుల
నిట్టూర్పుల కం తెక్కడ ?

13_003 అన్నమాచార్య కళాభిజ్ఞత 18

రామాయణం త్రేతాయుగ కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తి కి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగే దివ్యమైన కావ్యము.
తేన వినా తృణమపి న చలతి
నీ సంకల్పమే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగిన అన్నమాచార్యులు రామకథ ని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించిన వాటికి కొన్ని ఉదాహరణలు….