11_020 అభిప్రాయ కదంబం

                                           11 _018&19AV

 

ద్విభాషితాలు శీర్షికన “ మంచం ప్రక్క కిటికీ ” గురించి….. 

ధన్యవాదాలు 👍🏻👍🏻🙏

– Nagesh Babu Dwibhashyam

 

‘ తో. లే. పి. ’ శీర్షికన “ వంగూరి చిట్టెన్ రాజు ” గురించి…..

  • ఈనెల “తో.లే. పి ” శీర్షిలో మా గురువు గారు వంగూరి చిట్టెన్ రాజు గారి గురించి చదవడం చాలా ఆనందంగా ఉంది! నాలాంటి వారికి ఆయన ఎంతో స్పూర్తిదాయకం! వెంటనే రిప్లై ఇవ్వడంలో..ఒకరికి సహాయం చెయ్యడంలో వారి తర్వాతనే ఎవరైనా! అమెరికామిడీ తో పాటు చిట్టెన్ రాజుగారికి మరో ఇష్టమైన పదం “మొట్టమొదటి”!! మా గురువుగారు చేస్తున్న సాహిత్య సేవ గురించి…వారి ఔదార్యాన్ని గురించి ఓలేటి సుబ్బారావు గారు చెప్పినట్టు ఎంత చెప్పినా తక్కువే! పరిచయం అవసరం లేని వంగూరి చిట్టెన్ రాజుగారిని ఈ శీర్షికలో పరిచయం చేసిన సుబ్బారావు బాబాయి గారికి నా అభినందనలు..ధన్యవాదాలు!!
    – శ్యామలాదేవి దశిక, న్యూజెర్సీ- యు ఎస్ ఎ

 

  • సన్మిత్రులారా, 

 

నాకు కాస్త ఆలస్యం అయింది కానీ ఇప్పుడే జూన్. 2022 సంచికలో అమృతప్రాయమైన మనసుతో మీరు ప్రచురించిన ‘తో.లే. పి – వంగూరి చిట్టెన్ రాజు” చూసి భలే ఆశ్చర్యమూ, సంతోషమూ..ఇంకా ఏమిటేమిటో అవన్నీ కలిసి ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. “హమ్మయ్య.. ఇప్పటికైనా అందరూ కోరుకునే ‘తోక లేని పిట్ట పురస్కారం’ నాకు ఇప్పటికి దక్కింది కదా అని నేనూ, మా క్వీన్ విక్టోరియా ఒకరికి ఒకరం శాలువాలు కప్పేసుకున్నాం. అంతా నేను ఇప్పటిదాకా కలవని మీ ఇద్దరి అభిమానమే. నా గురించి అన్ని వివరాలు సేకరించడమే కాకుండా సరదాగా ఏకరువు పెట్టడంలో కూడా మీ ప్రత్యేకతని చాటుకుని, నాకు ఎనలేని గౌరవం చేశారు. ధన్యోస్మి. 

నా అభిమాన పత్రిక అయిన “శిరా కదంబం” లో అన్నగారు వో.వెం.సుబ్బు గారి తో.లే.పి లలో ఒకడిగా చోటు చేసుకున్నందుకు “టెలెగు హాల్ ఆఫ్ ఫేమ్” లో గోడ మీద బొమ్మ లాగా భావించేసుకుని సిగ్గుతో అష్టవంకరలూ తిరిగిపోతూ ……

 

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు

Phone: 832 594 9054

 

 

 “ కోటముట్టడి ” గురించి…..

  • రచన, గళం చాలా బాగున్నాయి.

అద్భుతమైన స్వర విన్యాసం
దృశ్యాన్ని కళ్ళముందు ఉంచారు

ఇక కీరవాణి రాగం లో కొనసాగిన స్వరవిన్యాసం యుద్ధాన్ని తలపించింది. నగేష్ బాబు గారికి, శిష్య బృందానికి అభినందనలు

– Chamarthi SRIRAMACHANDRAMURTHY

 

👍🏻👍🏻

– Nagesh Babu Dwibhashyam

 

“ సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం ” గురించి…..

 

 

 

 

– Jhansi Lakshmi

 

“ వెనుకేదో… ముందరేదో…. ” గురించి….. 

👏👏💐💐

అచ్చమైన తెలుగు గాత్రం

  • Nagesh Babu Dwibhashyam

 

“ కంజ దళాయతాక్షి ” గురించి…..

కంజదళాయతాక్షి కద. కంజము అంటే తామరపువ్వు

– Suryanarayana Vulimiri

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾