13_006 ఆనందవిహారి

 

మట్టి బండి – రచనా వైశిష్ట్యం 

రైతుల అనుభవాలు, కష్టనష్టాలను కళ్ళకు కట్టే “మట్టిబండి” పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తుందని విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు, నగరానికి చెందిన విలేఖరి కమలాకర రాజేశ్వరి పేర్కొన్నారు. పరిశోధకుడు, కవి, రచయిత, బాలసాహిత్యకారుడు డా. నాగభైరవ ఆదినారాయణ రచించిన ఈ దీర్ఘ కవిత గురించి “మట్టి బండి – రచనా వైశిష్ట్యం” పేరిట ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తన 44వ “నెట్”ఇంటి “నెల నెలా వెన్నెల” కార్యక్రమంగా శనివారం (14 జనవరి 2023) సాయంత్రం ప్రసారం చేసింది. “మట్టిబండి”  అనేది 42 పేజీల దీర్ఘ కవిత అని, ఇందులో పాత్రలకు పేర్లు ఉండవని రాజేశ్వరి తెలిపారు. అయినా ఆయా పాత్రలు తమ మనోభావాలను పాఠకులతో పంచుకుంటాయని అన్నారు. రైతులకు తాతల కాలం నాటి భూమితో తాతలతో ఉన్నటువంటి అనుబంధం, తన పిల్లలతో పాటు ఎదిగే ఎడ్లతో పిల్లలతో ఉన్నటువంటి విడదీయరాని అనుబంధం ఉంటాయని కవి పేర్కొన్నారని చెప్పారు. వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిలను పెళ్ళి చేసుకోవాలని పల్లె పడుచులు అనుకొకపోవడం, వ్యవసాయంలో అప్పులే కానీ లాభాలు ఎక్కువగా ఉండకపోవడం, గతిలేని పరిస్థితులలో సొంత ఊళ్లోని పొలం, ఎడ్లు, బండి అమ్ముకొని పట్నానికి తరలివెళ్ళడం వంటి సామాజిక అంశాల చుట్టూ కవితలోని ఇతివృత్తం ఉంటుందని,  మట్టిబండి రైతుకు ప్రతీక అని  వివరించారు. వస్తువు, భావజాలం రెండూ పడుగు, పేకల్లాగా అల్లుకుపోయినటువంటి ఉదాత్త రచనగా “మట్టిబండి” కనిపిస్తుంది, ఇందులో కవితార్తి సరస్వతీ స్రవంతిలాగా గోచరిస్తుంది  వక్త కొనియాడారు. ఒక సందర్భంలో పింగళి సూరన “కళా పూర్ణోదయం” రచనను గుర్తుకు తెస్తుందని అభిప్రాయపడ్డారు. ఆ కథను క్లుప్తంగా చెప్పారు. “మట్టిబండి”లో డా. నాగభైరవ రచనా వైశిష్ట్యాన్ని చక్కగా విశ్లేషించారు. 

కార్యక్రమానికి ముందు ప్రార్థన చేసి వీక్షకులకు ఆహ్వానం పలికిన ప్రముఖ గాయని నిడమర్తి వసుంధర వక్త గురించి పరిచయం చేస్తూ…. ఆమె తెలుగు అధ్యాపకురాలిగా పదవీ విరమణ చేశారని అన్నారు. “తెలుగు భారతి” ద్వారా అనేక పాఠ్య పుస్తకాలను రచించి సంపాదకత్వం వహించారని, వాటిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిందని వెల్లడించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక అనువాద రచనలు కూడా చేశారని తెలిపారు. ప్రస్తుతం ఒక దినపత్రిక విలేఖరిగా పని చేస్తున్నారని చెప్పారు. 

 

ఈ కార్యక్రమం వీడియో –

 

త్యాగరాజ ఆరాధన

సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ. తణుకు ఆధ్వర్యంలో 85వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు 02.02 2024 తేదీ నుండి 06- 02-2024 వరకు తణుకు పట్టణంలోని సజ్జాపురం లో ఉన్న రామకృష్ణ సేవా సమితి వేదికగా వైభవంగా జరిగాయి. 

ఆ కార్యక్రమాల వీడియో లు ఈ క్రింద — 

 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page