.
.
ప్రతి మనిషిలోను ఏదో ఒక ఆశయం, ఆసక్తి ఉంటాయి. జీవనోపాధి కోసం చేసే వ్యాపకం నుంచి బయిటకు వచ్చిన తర్వాత తమ ఆసక్తి, అభిరుచులననుసరించి సేవా కార్యక్రమమో, రచనలో, కళారూపమో…. ఇలా ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటారు. ఎప్పుడో వదిలేసిన విద్యార్థి దశను మళ్ళీ అనుభవించాలనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. పదవీ విరమణ చేసిన వారు ముఖ్యంగా ఇలాంటి ఆలోచన చేస్తారు. చాలామంది ఆరోగ్యం సహకరించినంతవరకు, ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు తమ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. 80 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పరిశోధనలు చేసి పిహెచ్‌డి పట్టాలు పొందినవారు ఉన్నారు. అప్పటికే వారికి ఒకటికి మించి డిగ్రీ లుంటాయి. అలాగే అరవై ఏళ్ళు దాటాక సంగీతం నేర్చుకునేవారు, చిత్రలేఖనం నేర్చుకునేవారు, ఇంకా తమ అభిరుచి తగ్గ పనులు నేర్చుకునేవారు, చేసుకునే వారు అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. మరికొంతమంది ఆ వయసులో నృత్యం నేర్చుకునే ప్రయత్నం కూడా చెయ్యడం అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. దీనికి వెనుక ఉన్న సత్యం ఏమిటంటే తనలోని తపనకు వయసుతో ముడిపెట్టకుండా, తనకు లభించిన సమయాన్ని వృధా చేయకుండా తన అభిరుచులను నెరవేర్చుకునేందుకు వినియోగించడమే ! ఇంకా కొంతమంది తమకు నచ్చిన పుస్తకాలను చదవడం, ఎప్పటినుంచో ఉన్న రచనాసక్తికి పదును పెట్టడం లాంటివి చేస్తారు.
ఉద్యోగాలు చేసే వారికంటే చెయ్యనివారికి, ముఖ్యంగా గృహిణులకు ఇంటి బాధ్యతల ఒత్తిడి తగ్గాక నడిమి వయసులోనే ఇలాంటి ఆసక్తులు బయిటకు వస్తాయి. ముఖ్యంగా ప్రవాసంలో ఉన్నవారిలో ఇలాంటి ఆసక్తులు ఎక్కువగా కనిపిస్తాయి. సమాజ సేవ, తెలుగు బడులు నిర్వహించడం, సాహిత్య సంగీత సేవ వంటి ఎన్నో కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం తమ స్వంత గడ్డకు, భాషకు, సంస్కృతికి దగ్గరగా ఉన్నందువలన కావచ్చు.
ఇటీవలి కాలంలో చాలా ఎక్కువమంది రచనలు చేస్తున్నారు. దీనికి అంతర్జాల వినియోగం పెరగడం, సోషల్ మీడియా విస్తృతి పెరగడం కూడా కారణం. అంతర్జాలం లేని రోజుల్లో తమ రచనలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకు వెళ్లాలంటే పత్రికలే ప్రధాన సాధనం. ఒక రచన ప్రచురించబడటానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ముద్రిత పత్రికలు తగ్గినా అంతర్జాలంలో పత్రికల సంఖ్య పెరిగిపోతోంది. ప్రచురణకి ఎక్కువ రోజులు వేచి ఉండనవసరం ఉండటం లేదు. అంతర్జాలంతో మరో సౌలభ్యం ఏమిటంటే ఏ పత్రిక అంగీకారం గురించి వేచి ఉండాల్సిన పని లేదు. స్వంతంగా ప్రచురించుకునే సౌకర్యం బ్లాగ్ ల ద్వారా, ఫేస్ బుక్, వాట్సప్ గ్రూప్ ల వంటి మాధ్యమాల ద్వారా ఏర్పడింది. వాటి ద్వారా కూడా చాలామంది తమ రచనలను ప్రచురించుకుంటున్నారు. అవి చాలామంది పాఠకులకు చేరుతున్నాయి. వాటిలో నాణ్యత లేదనుకునే బదులు ఇంతమంది క్రొత్త రచయితలు సాహిత్య లోకానికి పరిచయం అవుతున్నారని సంతోషించడం మేలేమో ! అంతమందిలో నుంచి కొంతైనా నాణ్యత రాకుండా ఉండదు.
ఏది ఏమయినా ముదిమి వయసులో మనమేం చేయగలం అని సమయాన్ని వృధాగా గడిపేకంటే ఏదో ఒకటి చేసి సద్వినియోగం చేసుకోవడం మంచిది.
ఎనభై సంవత్సరాల వయసు దాటినా, ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయినా తనలోని రచనాసక్తిని మాత్రం వదులుకోలేక మళ్ళీ కలం పట్టుకున్న రచయిత్రి శ్రీమతి వాణీమోహన్. తన విదేశీ యాత్రలు, ఉద్యోగరీత్యా ఉన్న ప్రాంతాలలో తెలుగు భాష, సంస్కృతి వ్యాప్తికి తాము నిర్వహించిన కార్యక్రమాల గురించి చిన్న చిన్న వ్యాసాలుగా వ్రాసి ‘ శిరాకదంబం ’ లో ప్రచురణ కోసం ఎంతో కష్టపడి పంపించేవారు. వాటి ప్రచురిస్తే ఎంతో ఆనంద పడేవారు. వయసు, ఆరోగ్యం తెచ్చిన సమస్యలెన్నిటి నుంచో ఉపశమనంగా ఉండేదని చెప్పేవారు. చివరిదాకా ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. నవంబర్ 12వ తేదీన అనారోగ్యంతో ఆమె స్వర్గస్థులయ్యారు. ఆమె వ్రాసిన చివరి వ్యాసం ‘ మా ఈజిప్ట్ పర్యటన ’ ఈ సంచికలో ప్రచురించడం జరిగింది, వాణీమోహన్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ…
.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.

కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao