13_001 ఓయి భారతీయుడా !

 

75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ

రచన : భమిడి కమలాదేవిగారు
గానం : సత్యభామ స్వాతి
సంగీతం : ప్రమోద్  

ఓయి భారతీయుడా – భావి భరత పౌరుడా
అమృతోత్సవపు వేళ – పునరంకితమౌదుమురా

చరణం 1:

పరదేశపు వారి పీడిత పాలననెదిరించి
ధనమనప్రాణములనొడ్డి సాధించిన స్వాతంత్య్రం
ప్రగతి పథమ్మున నడిపి – హైందవ కీర్తిని నిలిపి
ఆదర్శపు జాతిగా తీర్చిదిద్దు భారతావని   || ఓయి భారతీయుడా ||

చరణం 2 :
స్వధర్మో నిధనం శ్రేయః – పరధర్మో భయావహః

విశ్వశాంతి కాంక్షించే  వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే  – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ  సోదరా

చరణం 3 :

కర్షకత్వము నీది కృషి సలుపుము సోదరా
ఆధునికపు విజ్ఞానమునందుకొనుము సోదరా
నరనారీ శక్తి తో -వేద విజ్ఞానము  
పరిపాలన సామర్ధ్యం ఫలమంతమగురీతిని  || ఓయి భారతీయుడా ||

చరణం 4:

జనని జన్మభూమిశ్చ – స్వర్గాదపి గరీయసి

రామచంద్రుడన్నమాట మరువకు సోదరుడా
ప్రగతి పథమ్మున నడిపి – హైందవ కీర్తిని నిలిపి
ఆదర్శపు జాతిగా తీర్చిదిద్దు భారతావని   || ఓయి భారతీయుడా ||

చరణం 5 :

ముచ్చటగా ఠీవిగా – నింగినెగురు మన జండా
పతాక చ్ఛాయల్లో – మనమంతా ఒక్కటై
స్వాతంత్య్రపు స్వర్ణోత్సవ శుభసందర్భములో
శతకోటి నరనారీ ప్రణతులివే జననీ

*************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page