.
.
శుభం పలుకుతూ ‘ శుభకృత్ ’ ప్రవేశించింది. రెండు సంవత్సరాల పైబడి మహమ్మారి చేసిన కరాళ నృత్యంతో విలవిల్లాడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మళ్ళీ మరో రూపంలో విజృంభిస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నా, ఖచ్చితంగా దాని ప్రభావం గురించి ఇంకా పూర్తిగా అంచనాలు లేకపోయినా ప్రస్తుత పరిస్థితులను బట్టి అంతగా ప్రభావం చూపకపోవచ్చుననేది ప్రజల విశ్వాసం.
2019 లో వచ్చిన వికారి నామ సంవత్సరం నిజంగానే వికార స్వరూపం చూపించింది. ప్రపంచానికి క్రొత్తగా పరిచయమైన కరోనా వైరస్ ప్రజల్ని గడగడలాడించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇన్ని కోట్లమంది జనాభా ఉన్నా కూడా ఏకాకిగా బ్రతకవలసిన పరిస్థితులు కల్పించింది. సంఘజీవనం అనేమాట కొంతకాలం పాటు మర్చిపోయేటట్లు చేసింది. ఒకటి రెండు రోజులు కర్ఫ్యూ లాంటి పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండడానికి ఇబ్బంది పడే సామాన్య పౌరులు నెలల తరబడి ఇళ్లలోనే ఏ తప్పూ చేయకుండానే జైలుశిక్ష అనుభవించారు. పరిచయస్తులు, ఆత్మీయులు ఎదురైనప్పుడు ఆప్యాయంగా కరచాలనం చేసుకునే అలవాటు, ఆలింగనం చేసుకునే అలవాట్లు పూర్తిగా మర్చిపోయారు. దూరంగా జరిగిపోవడం అనే అలవాటు క్రొత్తగా అయింది. ఇంతకుముందు సీజన్ మారినప్పుడల్లా జలుబులు, దగ్గులు ఎక్కువమందిలో కనిపించేవి. ఎంత తుమ్మినా, దగ్గినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. అయితే ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఎవరైనా తుమ్మితే, దగ్గితే భయపడి దూరంగా జరిగిపోతున్నారు.
ఇలాంటి వికార నృత్యం చేసిన వికారి తర్వాత వచ్చిన చీకటిని ప్రతిబింబించే శార్వరి నామ సంవత్సరం కరోనా రెండవ దశ లోని చీకటి కోణాన్ని చూపించింది. ప్రపంచ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసింది.
2021 లో ప్రవేశించిన ప్లవ నామ సంవత్సరం మీద తెలుగు వారు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ పేరులోనే దాటించేది అనే అర్థం ఉండడంతో ఈ కష్టాలను దాటిస్తుంది అనే నమ్మకం పెట్టుకున్నారు. ఆ పేరుకు తగ్గట్లే కరోనా మూడో వేవ్ వచ్చిందని అనుకున్నా పెద్దగా ఇబ్బందులు లేకుండానే గట్టెక్కించింది. ఇప్పుడు శుభప్రదమైన పేరుతో ‘ శుభకృత్ ’ వచ్చింది. తప్పక శుభాలను ఇస్తుందని ఆశించడంలో అసహజం ఏమీ లేదు. ఇది తెలుగువారికి సంబంధించిన ఆకాంక్ష మాత్రమే కాదు. తమకే కాదు ప్రపంచం మొత్తానికి శుభం జరగాలని తెలుగు వారందరూ ఆకాంక్షిస్తున్నారు. దీనినిబట్టి సహజంగా శుభాకాంక్ష అనేది విశ్వజనీనం అని అర్థమవుతోంది. తాత్కాలికమైన వాటికోసం తమని తాము ఇతరులనుంచి విడదీసుకున్నట్లు కనిపించినా మనిషి మస్తిష్కంలో మాత్రం ‘ జగమంత కుటుంబం నాది ’ అనుకుంటూనే ఉంటాడని అర్థమవుతోంది.
సర్వే జనా సుఖినోభవంతు
.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao