10_003

ప్రస్తావన

ఆరు నెలలు గడుస్తున్నా, కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఇంకా విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. వాతావరణానికి, పరిసరాలకి, పరిస్థితులకు తగ్గట్లుగా లక్షణాలను మార్చుకొంటూ విజయయాత్ర సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరు నుంచి మళ్ళీ లాక్‌డౌన్ విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే వార్తలు సామాజిక మాధ్యమాలలో వెలువడ్డాయి. అయితే అవన్నీ నిజం కాదని, అటువంటి అలోచన ఏదీ తమ దగ్గర లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

లాక్‌డౌన్ తో దాదాపు అంతా స్థంభించిపోయింది. మానవ జీవనం అస్థవ్యస్థమైంది. ముందుకెళ్తే నుయ్యి… వెనక్కి వెడితే గొయ్యి అన్నట్లు బయిటకు అడుగు పెడితే కరోనా… ఇంట్లోనే ఉండిపోతే పూట గడిచేదెలా అనే సమస్య. చివరకు కరోనా మీద ఆకలి దే పైచేయి అయింది. ఆకలితో చావటం కంటె కరోనా చావడమే మేలు అనే స్థితికి ప్రజలు వచ్చేసారు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా మరోవైపు బ్రతుకు పోరు సాగించడానికే నిర్ణయించుకున్నారు. అయితే తీసుకోవలసిన జాగ్రత్తలలో కొంత అలసత్వం, నిర్లక్ష్యం కనబడుతోంది. ముఖ్యంగా సామాజిక / భౌతిక దూరం, మాస్క్ లు ధరించటం విషయం లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఖచ్చితంగా పాటిస్తూ ఎవరి పనులు వారు చేసుకుంటే ఉభయతారకంగా ఉంటుంది. కరోనా వ్యాప్తిని కొంతవరకైనా నియంత్రించవచ్చు. అలాగే విద్యాలయాలు తెరవటానికి మరికొంత సమయం తీసుకోవడం మంచిది. ప్రత్యామ్నాయాలను ఆలోచించడం మంచిది. అలాగే ఇప్పటికే సభలు, సమావేశాలు అంతర్జాలం లో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంటిలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం దాదాపుగా అందరికీ అలవాటు అయింది. ఇంకా కొంతకాలం దీన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. అలాగే పెళ్ళిళ్ళు వంటి ఉత్సవాలు, పండుగలు కూడా వీలైనంతవరకు నియత్రించుకోవడం మంచిది.

కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన... చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 

వారి వివరాలు –
  1. ‘ అభిజ్ఞ ’ మిత్రబృందం – జూలై, 2020 - ₹. 10,000/-
                              - ఆగష్టు, 2020 - ₹. 10,000/-
  1. శ్రీ వై. రామకృష్ణ, చెన్నై - రెండు సంవత్సరాలు - ₹. 1,000/-

వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis కు గాని, G. pay phone no. +91 9440483813 కి గాని పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు. – శిరారావు 

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

 

Subscription Form Link –  https://sirakadambam.com/subscription-form/

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

or Link : paypal.me/sirarao

***********************************

**********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో