Krishna

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_011 కృష్ణం వందే జగద్గురుం

అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.

12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15

అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_009 అన్నమాచార్య కళాభిజ్ఞత 14

అన్నమయ్య లౌకిక శృంగారాన్ని రోజువారీ మాటల్లోనే ఆయన పొందుపరిచారు. తెలిసిన భావాన్ని ఎవరికి వారుగా, ఎవరికి వారికి తెలిసిన మాటల్లో సున్నితంగా, పదం పదంలోను ప్రతి పదంలోను రసాన్ని సంపూర్ణంగా, దివ్యంగా పండించినటువంటి మహాకవి ఈయన. సారస్వత జగత్తులో ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. రసమంటే ప్రధానమైన ఒక భాగం. సర్వమైన, సమగ్రమైన, సంపూర్ణమైనటువంటి సారము అంతా కలిపి రసం. రెండవది రుచి. ఈ రెండూ మన అనుభూతిలో ఉన్న విషయాలే !

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!

12_008 అన్నమాచార్య కళాభిజ్ఞత 13

మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.

12_008 ముకుందమాల – భక్తితత్వం

వేంకటేశా! మేం నిన్ను తలచేంత పని లేకుండానే నీ దాసులే మాకు ఇహపరాల నివ్వగల సమర్థులు. ఎందుకంటే నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్న విజ్ఞానులు వారు. మరి వారిని తెలుసుకుని అనుసరిస్తే నిన్ను తెలుసుకున్నట్లే కదా! అందుకే నీ బంటు బంటుకు బంటునయినా చాలు. నీకు దాసుడనై తరించినట్లే! అంటారు అన్నమయ్య దాసోహపద్ధతిని వ్యక్తపరుస్తూ.

12_007 మా ఇంట అడుగేసేను

సంక్రాంతి పాట
వడ్డేపల్లి కృష్ణ రచన, శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో పద్మజ శొంటి గారి గానం….