11_001 భరతమాత

.

ఓ రత్నగర్భా !

ఓ జ్ఞాన కళికా !

.

నాలుగూ వేదాలు

నీ ఓడిని పెరిగాయి

దిగ్దిగింతాలలో

మారు మ్రోగాయి

.

భారతం వెలిసింది

భాగవతం మెరిసింది

కావ్యాలు ధ్వనించాయి

పురాణాలు పుట్టాయి

.

దశావతారాలు దర్శింప చేసితివి

ధర్మమే కవచమని దారి చూపించితివి

నీ సంతు బాపసులు కదటే

తపోభూమి నీది తల్లీ !

.

నిఖిల జగత్తుకు

నీవె కరదీపికవు

నీరాజనములందు కొమ్మా

సశ్యశ్యామల మూర్తి జననీ !

.

ఏటికోళ్లమ్మా !

కైమోడ్పులమ్మా !

నమస్సులమ్మా !

అభినందనలివిగో !     

.

******************