12_011
“ ప్రస్తావన ” గురించి….
A thought-provoking editorial. It’s unfortunate that the eco-harmonic Indic ways of agriculture have been taken over by the Western commercial rapacity the adverse effects of which we have already begun reaping. The farmers have genuine problems and some of them are exploited by mutually hostile political groups for their sectarian and vote-bank interests.
– U Atreya Sarma
ఏరువాక పూర్ణిమ గురించి తెలియని వారికి కూడా తెలిసే లాగా వివరంగా చెప్పారు. అభినందనలు.
– లింగంనేని సుజాత.
“ అవధానం ” గురించి….
చాలా బాగా చెప్పారు అవధానం గురించి,తెలియని విషయాలు తెలిసేటట్టు వుదాహరణ ల తో శారద గారు
– సూర్య కుమారి anuindi
తెలుగు వారు ఎప్పటికీ గర్వపడవలసినది, పరిరక్షించుకోవలసినది, ఇతోధికంగా వ్యాపింపజేసుకోవలసినది అత్యంత సృజనాత్మకమైన, విశిష్టమైన, మహాశ్చర్యానికి గురి చేసే అవధాన విద్య. మహాసాగరం వంటి ఈ ప్రక్రియను, ముఖ్యంగా అష్టావధానం గురించి, గుమ్మతేనె వంటి సోదాహరణ ప్రసంగబిందుధారలతో శ్రోతలను అలరించిన యర్రమిల్లి శారద గారు అభినందనీయులు, అభివందనీయులు. ఇటీవలనే కడిమిళ్ళ వరప్రసాద్ గారి అవధానాలను కొన్నిటిని అంతర్జాలంలో తిలకించడం జరిగింది. ఈ నేపథ్యంలో శారద గారు ఉదహరించిన కొన్ని పద్యపాదాలు, ఉందంతాలు కమనీయమైన పునశ్చరణగా భాసిల్లాయి. సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ గారితో నాకున్న కొంత సాహితీ పరిచయంతో కూడిన కొన్ని రచనా-అనుసృజన అనుభవాలు, అష్టావధాని “పద్మశ్రీ” ఆశావాది ప్రకాశరావు గారితో నాకున్న సాన్నిహిత్య బంధం — అవధానానికి నన్నొక వినమ్ర అభిమానిగా చేసాయి. అవధానం సదా విజయోస్తు! దిగ్విజయోస్తు!
– U Atreya Sarma
అవధానం గురించి తెలియని వారికి కూడా తెలిసే తట్లుగా వివరంగా చెప్పారు.అభినందనలు.
– లింగంనేని సుజాత
“ ద్విభాషితాలు – అమృతవర్షం ” గురించి….
Nice father
– PRAVEEN Kumar Reddy
“ ముకుందమాల – భక్తితత్వం ” గురించి…..
శుభోదయం Excellent post అండీ చాలా వివరంగా చెప్పారు.భక్తి అనేది మన దేహంలో జీర్ణించుకొని పోవాలి,అప్పుడే ప్రాపంచిక వస్తువులపై మొహం పోతుంది. ఎంత కోరికలు ఉంటే అంతే కష్టాలు. వాటిని వదులుతూ భక్తి మార్గం అవలంబించుకోవాలి.
ముకుండమాల నాకు చాలా ఇష్టం. భగవత్ గీత మరీ మరీ ఇష్టం.మంచి ఉపయోగకరమైన post లే వేస్తున్నారు కృతజ్ఞతలు మీకు.
excellent అండీ ముకుండమాల చాలా చాలా బాగా రాసారు కృతజ్ఞతలు మీకు. శుభోదయం
– Sunderpriya
“ భక్తి విప్లవకారులు – భగవద్రామానుజులు ” గురించి….
ఓమ్ శ్రీ రామానుజ తిరువడిగళే శరణం
– Sunder Priya
“ బంగారుతల్లి – కనకదుర్గమ్మ ” గురించి….
రచన బాగుంది. గానం వీనుల విందుగా ఉంది.కనక దుర్గమ్మ తల్లి దయ మన అందరి మీద ఉండాలని కోరుకుంతున్నాను.
– లింగంనేని సుజాత
“ అడగాలని ఉంది ” గురించి…..
అన్ని సమస్యలకూ ఆత్మహత్య పరిష్కారం కాదు.
భార్యాభర్తల సంబంధాల విషయంలో విడాకులు ఒక్కటే పరిష్కారం కాదు. మళ్ళీ పెళ్ళి చేసుకుని బ్రతకడం మీరు సూచించినంత తేలిక కాదు.శ్రీకర్ కి మగతనం తక్కువ అనే ఎక్స్ప్రెషన్ కన్నా అదే విషయాన్ని మరో విధంగా చెప్పి ఉంటే బాగుండేదేమో మేడమ్.
– శ్రీదేవీ వేణుగోపాల్
“అడగాలని వుంది “ చాలా బాగా వుంది . భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు ఒకరిపై ఒకరికి నమ్మకముండాలిగాని అనుమానానికి తావు ఉండకూడదు . ఈ కథలో భర్త అనుమానానికి గురికాబడున స్త్రీ పాత్రను మరియు దాంపత్య సుఖాన్ని ఇవ్వలేని భర్త పాత్రను మరియు సామాజికంగా అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందని సర్దుకుపోవాలి చెప్పే పెద్దల పాత్రలను చాలా చక్కగా వివరింవిహారు . సుజాత గారు ఇలాంటి సామాజిక మార్పులను తీసుకువచ్చే కథలను ఇంకా రాయాలని కోరుకుంటూ
సెలవు
సుబ్బారావు ఉప్పలపాటి
It is so good. Nice story and interesting. Good work
– Dr. A. Ambruni
“ దశరథ రామ ” గురించి….
శోభోదయం రామచంద్ర రావ్ గారు చక్కటి కీర్తన ముఖారీ రాగం
– Sunder Priya
“ మరివేరే దిక్కెవరు రామయ్య ” గురించి….
చక్కగా పాడరమ్మా.
అభినందనలు
– Sandhya Gollamudi
10_016 “ తెలుగువారి భోజనం ” గురించి….
Very good account of Telugu food. Nice work.
– Prabhakar
****************************************
గమనిక : ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.
పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023
****************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి