12_002Av గణేశ పంచరత్నం

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ।
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ ।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ ।
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ ।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ ।
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥

మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ ।
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ ।
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ ।
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥

గాయనీమణులు :  

శ్రీదేవి జోశ్యుల, అదితి రంగనాథన్, అపర్ణ వైద్యనాథన్, బిందు పొన్నపల్లి, గాయత్రి ముళ్ళపూడి, గాయత్రి పెమ్మరాజు, హేమ నళిని, జయశ్రీ బొండు, జోతి వెంకటేశన్, లక్ష్మి పెమ్మరాజు, లక్ష్మి విద్యాసాగర్, లాస్య ధూళిపాళ, మహాలక్ష్మి శివ, మైథిలి రామచంద్రన్, ప్రేమ చీటి, రోహిణి ధూళిపాళ, సంహిత పొన్నపల్లి, సంజీత శివ, శర్వాణి ధూళిపాళ, శైలజ చుండూరు, సిద్ధార్థ్ అయ్యగారి, శ్రీదేవి గుంటూరి, శ్రీగౌరి అంబటిపూడి, సుధా సాంబరాజ్, ఉషా అయ్యగారి.

వాద్య సహకారం :

వీణ : డా. శాస్త్రి వేదం  

వైయోలిన్ : ముకుంద్ జోశ్యుల

మృదంగం : నాగశ్రీనిధి కురువాడ 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾