10_009

ప్రస్తావన

ఎన్నో ఆశలతో 2020 క్రొత్త సంవత్సరానికి ప్రపంచమంతా స్వాగతం పలికింది. క్రొత్త సంవత్సరం తో పాటే కరోనా మహమ్మారి ప్రవేశించింది. దాని అనుపానులు తెలిసే లోపు దాదాపుగా అన్ని దేశాలను చుట్టేసింది. అందరిలో తీవ్రమైన అలజడి, భయం. 2020 ప్రవేశిస్తున్నపుడు అందరూ ఇదొక ప్రత్యేకమైన సంవత్సరమనీ, ఆ సంఖ్య శుభ సంకేతమనీ భావించారు. కానీ గతంలో ఏదైనా ఇలాంటి మహమ్మారులు వచ్చినపుడు ప్రపంచంలోని కొన్ని దేశాలకు లేదా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. అలాగే కొన్ని రకాల వాతావరణాలలోనే తమ ప్రతాపం చూపేవి. కానీ ఈ కరోనా మాత్రం ఏ దేశాన్నీ, ఏ ప్రాంతాన్నీ వదలలేదు. దేనికీ లొంగలేదు. ఎన్నడూ లేనిది నెలలపాటు ప్రపంచమంతా జనజీవనం స్తంభించిపోయింది. 2020 సంవత్సరం పూర్తి కావస్తోంది. కానీ కరోనా భయం ఏమాత్రం తగ్గలేదు. ఒక ప్రక్క వేక్సిన్ వస్తోందనే ఆశలు కలుగుతున్నా, మరోప్రక్క సెకండ్ వేవ్ భయపెడుతోంది. 2021 వ సంవత్సరం వచ్చేస్తోంది. కనీసం క్రొత్త సంవత్సరంలో అయినా ఈ మహమ్మారి శాంతించి ప్రపంచ ప్రజలందరినీ మనఃశాంతిని కలుగజెయ్యాలని కోరుకుందాం.

అయితే ఇక్కడ రెండు విషయాలు అందరూ గమనించాలి. ఒకటి – చిన్నా, పెద్దా…. ధనిక, బీద…. వర్ణ, కుల, మత, లింగ వంటి ఏ బేధాలు లేకుండా అన్ని రకాల వారిని పలుకరించి సర్వ మానవ సమానత్వాన్ని చాటి చెప్పింది. ఇప్పటికైనా ఈ తెలివి తెచ్చుకుని ప్రజలందరూ ‘ వసుధైక కుటుంబం ’ అనే మన తత్వాన్ని కేవలం నినాదానికో, ఉపన్యాసానికో పరిమితం చేయకుండా తప్పనిసరిగా పాటించాలి.

రెండు – మానవుడే మహనీయుడు… శక్తిపరుడు… యుక్తిపరుడు. క్రొత్త క్రొత్త ఆవిష్కరణలతో సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించాడు. ఎన్నెన్నో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు కనుక్కున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు. చంద్ర లోకమైనా… దేవేంద్ర లోకమైనా…. ఎక్కడికైనా వస్తా అంటున్నాడు. ఇన్ని చెయ్యగలిగిన, మేధోపరంగా ఇంత అభివృద్ధి చెందిన మనిషిని మించిన అభివృద్ధి ఈ సూక్ష్మ జీవుల్లో కనిపిస్తోంది. వాటికి విరుగుడు కనిపెట్టినప్పుడల్లా అవి క్రొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. మందులు వాడి వాటిని బలహీనపరచగలిగానని ఆనందించేలోపే అవి మరింత బలోపేతమవుతున్నాయి. ఎంతటి వాడికైనా గర్వం, అహం పనికిరాదని మనకంటే కొన్ని లక్షల రెట్లు చిన్నదైన ఈ సూక్ష్మజీవులు తెలియజేస్తున్నాయి. దారి తప్పుతున్న జనాన్ని హెచ్చరించేందుకు, దారిలో పెట్టేందుకు భగవంతుడు / ప్రకృతి చేసిన ఏర్పాటేమో ఇది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరోనా రాకలోని ఈ ధర్మాసూక్ష్మాన్ని గ్రహిస్తే మనవాళికి శ్రేయస్కరం.         

తెలుగుదనానికి, తెలుగు సంప్రదాయానికి తన గీతలతో, చేతలతో ఒక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప కళాకారుడు ‘ బాపు ’. తెలుగులో ఎందరో లబ్దప్రతిష్టులైన చిత్రకారులు ఉన్నా, తెలుగు చిత్రకారులు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘ బాపు ’ అనే పేరే. తెలుగు ‘గీత’కారుడు ‘ బాపు ’. ఈ నెల 15వ తేదీన ఆయన జయంతి.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అంతకుముందు ఎంతమంది పోరాటాలు చేసినా సాధ్యం కాని దానిని తన బలిదానం తో సుసాధ్యం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. అకుంఠిత దీక్ష, దృఢమైన సంకల్పం, నిజాయితీ, పట్టుదల వంటి ఉత్తమ లక్షణాలకు సజీవ రూపం శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాటంకంగా 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆత్మత్యాగం చేసిన రోజు డిసెంబర్ 16.

**********************************************************

 

 కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవిత కాలం :

భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subcribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

 

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

**********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో