.
రాత్రి…
కనురెప్పల వెనుక…
వల విసురుతాను.
నీ గుర్తులు చిక్కుతాయి.
.
గతించిన గీతం …
మళ్ళీ సన్నగా వినిపిస్తుంది.
.
ఎప్పుడో చెరిగిపోయిన దృశ్యాలు …
వర్తమానంలో…
ఆశల్ని విరజిమ్ముతాయి.
.
మెలకువకి అందని పారవశ్యం …
నిద్రను ఆవహిస్తుంది.
.
ఇంతలో….
దృశ్యం…జారిపోతుంది!
.
కల విరజిమ్మిన మత్తు..
కరిగిపోతుంది.
.
మరో రాత్రి కోసం…
మళ్ళీ నిరీక్షణ మొదలవుతుంది!
.
**********************************