11_010 వార్తావళి

                      TAGS-శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ ఫలితాలు

2022 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా,  ఇంగ్లండ్, స్పెయిన్, ఐర్లండ్, గల్ఫ్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం. టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , స్వర పత్రిక https://swara.media/magazines/, మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక లోనూ ప్రచురించబడతాయి.

 “ఉత్తమ కథానిక విభాగం విజేతలు”

1.ప్రథమ బహుమతి :  సెల్యూట్ – తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

2.ద్వితీయ బహుమతి : ఋణం – సాయి ప్రభాకర్ (ఫ్లోరిడా, అమెరికా) ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

3.తృతీయ బహుమతి : ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు – కె.మీరాబాయి (కాలిఫోర్నియా, అమెరికా) ($28, ప్రశంసా పత్రం)

న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కథానిక:

1.గొప్పామె ఉరఫ్ గొప్పాయన – సౌమ్యా వి.బి (కెనడా)

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:

  1. దీపపు వెలుగు – నరసింహ గరిమెళ్ళ (టెక్సాస్, అమెరికా)

2.అలెక్సా – శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)

3.బొడ్రాయి – శ్రీధర్ రెడ్డి బిల్లా (కాలిఫోర్నియా, అమెరికా)

4.అక్షరాభ్యాసం – సుగుణ వల్లి (కెనడా)

5.మా అమ్మానాన్నల పెళ్లిరోజు – రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)

ప్రశంసా పత్రం పొందినవారు:

1.గంభీరాలకే మరుదు – లక్ష్మీ రాయవరపు (కెనడా)

2.డిపార్చర్ గేటు – పాణిని జన్నాభట్ల (మసాచుసెట్స్, అమెరికా)

3.రక్షణ కవచం – శేషా రత్నం పారుపుడి (టెక్సాస్, అమెరికా)

“ఉత్తమ కవిత విభాగం విజేతలు”:

1.ప్రథమ బహుమతి :: ఆర్షజాతి (పద్యఖండిక) –  శఠగోపన్ శ్రీవాత్సవ శేషం (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

2.ద్వితీయ బహుమతి :: నీరాజనం – తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా)  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

3.తృతీయ బహుమతి :: కంచె – రఫీ మహమ్మద్ (దక్షిణాఫ్రికా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కవిత:

1.ఆటుపోట్లు – పొలిమేర మల్లేశ్వరరావు (టెక్సాస్, అమెరికా)

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:

1.నేను నాన్నని :: గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా)

2.ఆకాశం :: రాధికా నోరి (ఫ్లోరిడా, అమెరికా)

3.అన్వేషణ :: శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)

4.అంతర్ముఖం :: డా.సుదర్శన్ రాపోలు (లివర్మోర్, కాలిఫొర్నీయా, అమెరికా)

5.ఎటో వెళ్ళిపోయింది మనసు :: శేషారత్నం పారుపూడి (టెక్సాస్, అమెరికా)

6.నా దేశపు అభివృద్ధిని చూడాలనిపిస్తుంది :: మల్లిఖర్జున రావు కొమర్నేని (ఒక్లహోమా, అమెరికా)

ప్రశంసా పత్రం పొందినవారు:

1.ఊగిసలాట – లక్ష్మీ రాయవరపు (కెనడా)

2.కిటికీ –  మోహన్ మణికంఠ ఉరిటి (స్పెయిన్)

3.పలకరింపు – యామిని రాజశేఖర్ కొల్లూరు (గల్ఫ్ – అబు దాబి)

4.ఎదురు చూపులు – రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)

5.సిపాయి – రాజేష్ తోలేటి (ఇంగ్లండ్)

6.నేస్తం – ఇందు నిట్ల (ఒంటారియో, కెనడా)

విజేతలందరికీ సాహిత్యాభినందనలు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర మరియూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!! టాగ్స్ ఆధ్వర్యంలో “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారాలు అందజేసిన రమేష్ వడలి గారికి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు సహాయ సహకారాలు అందజేసిన శ్రీ రమేష్ వడలి గారికి టాగ్స్ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు telugusac@yahoo.com  కు సంవత్సరం పొడవునా పంపవచ్చును.

“శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” ఫలితాల సమాచారం ఈ క్రింది ఫేస్ బుక్ లింకు లో ఉంచబడినది.

https://tinyurl.com/TagsUanMurthy4thContestResults 

సదరు ఫేస్ బుక్ లంకెను లైక్ చేయగలరు, తద్వారా మా ఈ ప్రయత్నాన్ని మీ స్నేహితులతో పంచుకొనగలరు.

శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక పూర్వ సంచికలకోసం ఈ లంకెను సందర్శించండి: http://sactelugu.org/tags-patrika/

ధన్యవాదాలు,

శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం

Telugu Association Of Greater Sacramento (TAGS)

Post Box: 1666

Folsom, CA-95763, USA

Website: http://sactelugu.org/tags-board 

Facebook: https://facebook.com/sacTelug

             వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)

3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498

US Federal Tax ID: 76–444238

Phone: 1 832 594 9054; E-mail: vangurifoundation@gmail.com

________________________________________________________________________

                                  27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2022)

గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ  నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  US116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ US$116

 

“మొట్టమొదటి రచనా విభాగం” -ప్రపంచ వ్యాప్తంగా

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

 

“నా మొట్టమొదటి కథ”: (ఉత్తమ కథ):  US$116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): US$116

 

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో  కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణ కి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 1, 2022) కాని, అంతకు ముందు కానీ  ప్రకటించబడతాయి. కాపీ రైట్స్  ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను  రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is:  March 15, 2022

Please send entries by email attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha@gmail.com  &  vangurifoundation@gmail.com

 

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾