12_005 ద్విభాషితాలు – కీర్తిశేషుడు

 

కోటానుకోట్లమందిలో…

నువ్వూ ఒకడివైనప్పుడు..

నువ్వు …

ప్రపంచం నుండి అదృశ్యమైన రోజు…

నదులు పొంగవు.

పగలు.. రాత్రి స్తంభించవు..

రోడ్డుపై ప్రవాహమాగదు.

విందులు…వేడుకలు…

విహారాలు…వినోదాలు…

వెలిగిపోతూంటాయి.

 

వేల చదరపుమైళ్ళ విస్తీర్ణంలో..

కోటానుకోట్ల జనవాహినిలో..

ఒకమూల…

నీ నిర్గమనం…

నిశ్శబ్దంగా జరిగిపోతుంది.

వందలాది వార్తల్లో కలిసిపోతుంది.

 

ఇంటిలోపల…

ఓ కన్నీటి బొట్టు..ఓ కష్టం..

నిట్టూర్పు..ఓదార్పు…

పెనవేసుకొంటాయి.

వాటినీ.. కొన్నాళ్ళకు….

కేలండర్ కాగితాలు ….

తమతో మడిచేసుకుంటాయి.

 

అందుకే…

నిర్గమనం సత్యమైనప్పుడు…

కోటాను కోట్ల మందిలో..

నువ్వు ఒక్కడిగా జీవించు!

 

నిర్గమనం సత్యమైనప్పుడు…

కీర్తిని పండించుకో!

నిన్ను నువ్వు మర్చిపో!

వేల మనసుల్లో నిండిపో!

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾