11_005 AV

11_005 AV

.

ప్రస్తావన

.

పాఠకులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు.

కళాకారుడికి చప్పట్లే ఊపిరి. రచయితకి తన రచనలపై స్పందనలే ఇంధనం. అలాగే పత్రిక నాణ్యతకు చదువరుల / వీక్షకుల సంఖ్యే కొలమానం. గత కొంతకాలంగా సరాసరిన నెలకు శిరాకదంబం వీక్షకుల సంఖ్య లక్ష హిట్స్ గా ఉంది. కానీ ఇటీవల చేసిన మార్పుల తర్వాత అనూహ్యంగా హిట్స్ పెరిగాయి. అక్టోబర్ నెలలో అవి లక్షన్నర చేరాయి. అంటే పాఠకులు / వీక్షకులు నవ్యతను కోరుకుంటున్నారని అర్థమవుతోంది. ఈ పరిణామం బాధ్యతను కూడా పెంచుతుంది. దానితో బాటు భారాన్ని కూడా పెంచుతోంది.

నాణ్యమైన సరుకుకి ఎప్పుడూ గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. దానితో బాటు పోటీ కూడా పెరుగుతుంది. దాన్ని తట్టుకుని నిలబడాలంటే చాలా శక్తి కావాలి. ఆ శక్తి పాఠకుల / వీక్షకుల దగ్గర నుంచే రావాలి.

మన పండుగలలో ప్రధానమైనవి కొన్ని చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటాము. అలాంటి వాటిలో ఒకటి దీపావళి. నిజానికి ఈ దీపావళి భారతీయులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రపంచంలో చాలా దేశాలు జరుపుకుంటాయి. కాకపోతే కారణాలు, సందర్భాలు వేరు వేరు. అయినా మూలసూత్రం మాత్రం ఒకటే…. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఈ పండుగలో మరొక ప్రముఖమైన విశేషం నారీశక్తి ప్రదర్శన. సత్యభామ రూపంలో రాక్షస సంహారం కావించడం అందులో భాగమే. నిజానికి నారీశక్తి గురించి మన సంస్కృతే మనకి నేర్పుతోంది. ఆదిపరాశక్తిగా, మూలపుటమ్మగా స్త్రీని కొలవడం మన హైందవ సాంప్రదాయం. స్త్రీని అగ్రస్థానంలో, పూజనీయ స్థానంలో నిలబెట్టాయి మన పురాణాలు.

అయితే అంతటి మహోన్నతమైన స్థితిలో ఉన్న స్త్రీకి ఇవ్వవలసిన సముచిత స్థానాన్ని వర్తమాన కాలంలో ఇస్తున్నామా అంటే లేదనే చెప్పాలి. దానికి నిదర్శనమే స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోవడం. లోకాన్ని పీడిస్తున్న రాక్షసుడిని ఎదుర్కొని నిర్మూలించిన సత్యభామ వంటి ధీరవనితల శక్తి నిర్వీర్యమైపోయిందా ? వారిలో ఇప్పుడా ధీరత్వం లోపించిందా ?

సహజంగా ఉన్న గుణం ఎక్కడికీ పోదు. కాకపోతే నిద్రాణమై ఉంటుంది. అవసరమైనప్పుడు బయిటకు వస్తుంది. ఇప్పటికే చాలామంది వనితలు తమలో ఉన్న ప్రతిభను, శక్తిని అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడేవారు, ముందడుగు వెయ్యడానికి జంకేవాళ్ళు, తమలో ఉన్న బలం కంటే బలహీనతలనే ఎక్కువగా గుర్తించేవాళ్లు ఇంకా చాలామందే సమాజంలో ఉన్నారు. బలం అంటే శారీరిక బలం మాత్రమే అనుకునే వారే ఎక్కువ. దానికంటే ఎంతో విలువైనది మానసిక బలం. నిజానికి పురుషులలో కంటే స్త్రీలలోనే మానసిక బలం ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే స్త్రీశక్తికి తిరుగులేదని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. మహిళలు అందరూ ఈ విషయాన్ని గుర్తించి ముందడుగు వేస్తే ఒక్కొక్కరు ఒక సత్యభామ అవుతారు.     

.

******************************************************************************************

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao