ప్రస్తావన
గత సంవత్సరం కరోనా సృష్టించిన కల్లోలం నుంచి నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లే ఉంది. ముఖ్యంగా పాఠశాలలు కొన్ని చోట్ల పునః ప్రారంభమయ్యాయి…. మరికొన్ని చోట్ల ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కరోనా నేర్పిన పాఠాలను గుర్తుంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక విద్యా సంవత్సరం కరోనార్పణమయ్యింది. అయితే ఒక క్రొత్త విద్యావిధానం అనుభవంలోకి వచ్చింది. అదే ఆన్‌లైన్ విద్యాబోధన. దీనివలన లాభమా, నష్టమా అని ఆలోచిస్తే ఆపద్ధర్మంగా కొద్దిరోజుల కోసం బాగానే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి.
ఈ పరిస్థితి వలన కలిగే నష్టాలలో ఒకటి ముఖ్యంగా పిల్లలు అంతర్జాలానికి ఎక్కువగా అలవాటుపడతారు. గతంలో అంతర్జాలం వాడినా అది పరిమితంగా, పెద్దల పర్యవేక్షణ కొంతమేరకైనా ఉండేది. చదువు పేరుతో ఎక్కువ సమయం అంతర్జాలంలో గడపవలసిన అవసరం రావడంతో వాళ్ళు ఏమి చేస్తున్నారో, చూస్తున్నారో వంటి వాటిమీద పర్యవేక్షణ లోపిస్తోంది. ఆన్‌లైన్ తరగతులు అనే ముసుగులో ఉండటం వలన అది కష్టసాధ్యం కావడంతో పిల్లలకి మరికొంత స్వేచ్ఛ దొరికింది. అంతేకాకుండా ఈ విధానం ‘ నూతిలో కప్ప ‘ జీవనాన్ని తలపిస్తుంది. ఎవరితోనూ కలవకుండా ఒంటరి జీవనానికి అలవాటు పడితే భవిష్యత్తులో సమాజంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
మరో నష్టం పిల్లలకి సామాజిక జీవనం దూరమైంది. పాఠశాల కి వెళ్ళినపుడు చుట్టూ అనేక రకాల విద్యార్థులను కలుసుకునే అవకాశం ఉండేది. దీనివలన సమాజంలో ఉండే అనేక రకాల మనస్తత్వాలు, పరిస్థితులు అనుభవంలోకి వస్తాయి. పదిమందితో కలసి జీవించడం నేర్చుకుంటారు. స్నేహానికి, ద్వేషానికి మధ్య ఉన్న సన్నని విభజన రేఖ చెరిగిపోయి స్వచ్చమైన స్నేహానికి పునాది పడుతుంది. బాల్యస్నేహం లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు జీవితాంతం మనసులో పదిలంగా ఉంటాయి. అప్పుడప్పడు…. ముఖ్యంగా వృద్ధాప్యంలో తలుచుకోవడం మరింత మధురంగా ఉంటుంది. ఇటీవల కాలంలో చిన్నప్పుడు కలసి చదువుకున్న మిత్రులు తిరిగి కలుసుకుని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం పునర్‌సమావేశాలు ( Reunion ) నిర్వహించడం పెరిగింది. దీనివలన పరస్పరం వారివారి అనుభవాలను, పరిస్థితులను తెలుసుకుని అవసరమైన సలహాలు, సహాయ సహకారాలు అందించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో బాల్యమిత్రుల పలకరింపు పన్నీటి జల్లులా, నిండు పున్నమి వెన్నెలలా సేద తీరుస్తుంది.
ఇక పాఠశాలలు తెరుస్తున్నవేళ గత సంవత్సర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత శుభ్రత తో బాటు, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత దూరం పాటించడం వంటి వాటిలో పిల్లలకి సరైన అవగాహన కలిగించాలి. దానితో బాటు పాఠశాలలో త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణలో అవసరమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి. పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని గ్రహించాలి. మానవ వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది. సరైన బోధనతో బాటు ఆరోగ్య పరిరక్షణా చర్యలు కూడా చాలా అవసరం.
నేటి బాలలే రేపటి దేశ పౌరులు.
.
**********************************************************
.
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవిత కాలం :
భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subcribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
********************************************************
**********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…