12_010 క్రాంతదర్శి – కందుకూరి

 

నూట డెబ్బది ఆరు వత్సరాలు గడిచాయి..

ఇంకా జయంతులు

శత వర్ధంతి ముగిసినా మరింకా వర్ధంతులు…

ఏమిటి ఈయన గొప్ప?!

ఎందుకు ఇన్ని తరాలు గడిచినా ఇంకా స్మరించుకుంటూ ఉన్నది మన తెలుగు జాతి?!

వీరేశలింగం పంతులు అంటేనే స్ఫురణకు వచ్చేది సంఘ సంస్కరణ…

మూఢాచారాల బహిష్కరణ….

బాల్య వివాహాల తిరస్కరణ….

విధవా పునర్వివాహాల అంగీకరణ….

స్త్రీ విద్యా స్వీకరణ…

ఇవన్నీ కలబోసిన నవ్య

సంఘ సంస్కరణ…

వట్టి మాటలు కట్టి పెట్టిన ఘనుడు….

సంఘం కోసం సర్వస్వం అర్పించేసిన త్యాగ ధనుడు…..

హితకారిణి స్థాపించి దిక్కులేని ఆడవారికి

పునర్జీవితాలను ఒసగిన మాన్యుడు…

తెలుగు సాహిత్యానికి నవ యుగ వైతాళికుడు…

జీవన పర్యంతం సాహితీ సేద్యం చేసిన కృషీవలుడు….

అసమ వివాహాలను అణచిన ధీరుడు…

అస్పృశ్యతపై  ఉద్యమించిన శూరుడు…

అవినీతి, లంచగొండి తనాన్ని ఎండగట్టిన అనన్య సామాన్యుడు…

నాటి సాంఘిక దుర్మార్గాలను దునిమిన వీరుడు ఈ వీరేశలింగడు…

అందుకే ఎన్ని ఏళ్ళైనా…

ఎన్ని తరాలు గడిచినా…. శత సహస్ర జయంతులు…

శత సహస్ర వర్ధంతులు సజీవ స్రవంతిలాగా….ఆచంద్ర తారార్కం అలా అలా …. ఇలా ఇలా సాగిపోతూనే ఉండాలి….ఎప్పటికీ…. ఏనాటికీ….

జయహో కందుకూరి వీరశలింగం పంతులు….జయహో

 

****************************************************

  👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page