11_007AV ఇదేనండీ పెళ్లిసందడి 11_007AV December 1, 2021 పెళ్ళి పందిట్లో సందడి ఇదేనండీ ఇదేనండీపెళ్ళి సందడి చూడండి చూడండి ఎంత సందడిఆడ పెళ్ళివారు పెళ్ళి మంటపానికి వచ్చారండీవారి వెనుకె పురోహితుడు హుటాహుటిన వచ్చారండీ ఇదేనండీ… పురోహితుడు సరుకుల లిస్ట్ ని కిందా పైనా చూసెనండీకర్పూరం తమలపాకులు లిస్ట్ లో లేవని సణిగెనండీ ఇదేనండీ… పెళ్ళివారు వచ్చే టైంకి అంతా ఖంగారేనండీఎదుట ఉన్న వస్తువులే కంటికానలేదండీ ఇదేనండీ.. అంతలోనే పెళ్ళివారు దర్జాగా వచ్చారండీవారికి మర్యాదలు చేసి విడిదిలోకి పంపిరండీ ఇదేనండీ.. పీటీ ఉషలాగా ఆడ పెళ్ళివారు పరుగులండీఎక్కడ లోటు జరుగునో అని తిరిగి అలసిపోయారండీ ఇదేనండీ… వచ్చిన చుట్టాల సంగతి మరీ వింతగుందండీపెళ్ళిపనులు మానేసి సినిమాకి వెళ్ళిరండీ ఇదేనండీ… ఎవరి మట్టుకు వాళ్ళే పని చేస్తున్నట్లు పోజులండీకొంతమందే సిన్సియరుగ పెళ్ళిపనులు చేసిరండీ ఇదేనండీ… రిసెప్షనుకి చాలామంది గెస్ట్లు వచ్చినారండీవిందు భోజనం బాగా తిని బొకే మాత్రమిచ్చిరండీ ఇదేనండీ… 👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾