10_001 సంస్కృతి – కూచింత చిత్రకల్పనలు

 

                                   “మాటలు రాయడం అంటే మాటలు కాదన్నట్టు, చిత్రం చిత్రించడం మాత్రం చిత్ర విచిత్రమే.మామూలుగా ఓ చిత్రం చిత్రించడం అదో వైభవం, మరి పాటో, పద్యమో వింటూ అందులోని భావాన్ని మనోధర్మంగా అప్పటికప్పుడు చిత్రించే చిత్ర సంగీత ప్రక్రియ చిత్రకారుడు “కూచి” కి కుంచెతో భగవంతుడు పెట్టిన విద్య.

కోనసీమలోని అమలాపురాన “వీరభద్రశర్మ, వర్ధనమ్మ” గార్ల 4వ కుమారుడై….తన 5వ ఏటనుండే “వంకాయ బొమ్మ”కు శ్రీకారం చుట్టి…తన చిత్రకల్పనని జగత్ప్రసిద్ధం చేసుకుంటున్నారు.

“ఆశుచిత్రణలో” 2002 నుంచి కుంచెమోపి…తిరునాధుని మహదాశీస్సుతో ..ప్రఖ్యాత “శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్” నుంచి అపూర్వ ప్రజాదరణ పొందిన “చిత్రగానం” కార్యక్రమం ద్వారా… పదకవితాపితామహుడు శ్రీ అన్నమార్యుని సంకీర్తనలు చిత్రకల్పన చేస్తూ దేశదేశాల్లో భక్తకోటులను అలరించి, వారి ఆశీస్సులు,అభినందనలు అందుకున్నారు.

భారతీయ సాహిత్య, సంగీత, నృత్య ప్రక్రియల్లోనే కాక..ఈ జాతి గర్వించే “వేదపఠనం, అవధానం, ప్రవచనం” వంటి అపురూప ప్రక్రియలకూ మహామహులతో కలసి “చిత్రకళా సమ్మేళనా”లు చేసి…అంతర్జాతీయ ఖ్యాతి గడించి…”ఆశుచిత్రలేఖనా ప్రక్రియ”కు అమోఘమైన ఖ్యాతి తెచ్చారు శ్రీ కూచి.

ఏ ప్రక్రియ ఐనా అందులోని మనోధర్మాన్ని ఆకళింపు చేసుకుని కాన్వాస్మీద “సద్యోచిత్రణ” వీరి ప్రతిభ.

శ్రీ కూచి చిత్రసమ్మేళనాల్లో ముఖ్యమైనవి…

“అన్నమయ్య గాత్ర-చిత్ర సమ్మేళనం”,

“వాగ్గేయకార కీర్తనా- చిత్ర సమ్మేళనం”,

“శ్రీ శలాక రామాయణవ్యాఖ్య-చిత్ర సమ్మేళనం”,

“ఉగాది కవితా-చిత్ర సమ్మేళనం”,

“ప్రఖ్యాత నాట్యకళాకారిణి మంగళాభట్ తో కథక్-చిత్ర సమ్మేళనం”,

“మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారితో డెట్రాయిట్ అమెరికా తానా సభల్లో నవావధానం లో చిత్రకవిత్వం పృచ్ఛకునిగా అవధాన-చిత్ర సమ్మేళనం”,

“మైసూరు అవధూత దత్తపీఠం మహాస్వామి శ్రీ గణపతి సచ్చిదానంద మహోదయులతో దత్తగాన-చిత్ర సమ్మేళనం”,

“ప్రఖ్యాత మాటీవీ నిర్వహణలో.. మాండొలిన్ సుభాష్ తో వాద్య-చిత్ర సమ్మేళనం”, మరియు “మార్ధంగిక సార్వభౌమ శ్రీ ఎల్లావెంకటేశ్వరరావు గారి బృందంతో ఫ్యూషన్ శివతాండవ స్తోత్ర-చిత్ర సమ్మేళనం”,

మూర్తీభవించిన వేదస్వరూపం శ్రీ రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారి కి నివాళిగా రాజమహేంద్రవరం గోదావరీతీర పుష్కరఘాట్లో అపూర్వమైన “ ఘనాపాఠీ వేదపఠన-చిత్ర సమ్మేళనం”,

“చెన్నై, నారదగానసభ నిర్వహణలో అన్నమయ్య నవవిధభక్తి సంకీర్తనా-చిత్ర సమ్మేళనం”,

“చెన్నై ప్రఖ్యాత గురుస్మృతి నిర్వహణలో మాండొలిన్ మాంత్రికుడు మాండొలిన్ శ్రీనివాస్ కు నివాళిగా మాండోలిన్ భార్గవ్ తో కలసి ఏభై రాగ-చిత్ర సమ్మేళనం”,

“తిరునాధుని ఆశీస్సుతో తిరుమలలో జరిగిన శ్రీ త్యాగయ్య పంచరత్నకృతి-చిత్ర సమ్మేళనం”,

“గాయని శ్రీమతి సునీత తో లలితగీత-చిత్ర సమ్మేళనం”,

“ప్రఖ్యాత స్వామి చిన్మయానందుల శతాబ్ది ఉత్సవాల్లో, పూణెలో గాత్ర-చిత్ర సమ్మేళనం”,

“ముంబాయ్ చిన్మయామిషన్ ఆధ్వర్యాన ప్రఖ్యాత ఎమిటీ యూనివర్సిటీ లో గాత్ర-చిత్ర సమ్మేళనం”,

“ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురుదేవులు శ్రీ కందుకూరి శివానందులు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సముఖాన గాత్ర-చిత్ర సమ్మేళనం”,

“కొవ్వూరు గోష్పాదాల రేవు సమీపాన కొలువైఉన్న కృష్ణ గౌడీయమఠం లో శ్రీకృష్ణగాన-చిత్ర సమ్మేళనం”,

“డెట్రాయిట్ అమెరికా తానా సభల్లో వాగ్గేయకార కీర్తనా-చిత్ర సమ్మేళనం”,

“విశాఖ స్టీల్ప్లాంటులో శ్రీ రామాయణ రమణీయ గాత్ర-చిత్ర సమ్మేళనం”,

“ప్రఖ్యాత సంస్కృతి ఫౌండేషన్, హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ఆరాధనా మ్యూజిక్ ఫెస్టివల్ లో ముమ్మారు త్యాగరాజ పంచరత్న-చిత్ర సమ్మేళనం”,

ఇటీవల “డల్లాస్ అమెరికా పద్యలహరి ఆన్లైన్ లో నిర్వహించిన శ్రీ అన్నమాచార్య అలమేలుమంగా వెంకటేశ్వర శతక-చిత్ర సమ్మేళనం”,

“వీరి నిర్వహణలోనే తెలుగు కథా-చిత్ర సమ్మేళనం”,

“ప్రఖ్యాత దర్శకులు శ్రీ కె.రాఘవేంద్రరావు రూపొందించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం సంపూర్ణ చిత్రణ”,

“విదూషి శ్రీమతి డా: శొంఠి శారదాపూర్ణ పూర్ణమిదం శతక-చిత్రకల్పన”,

“తిరుపతి శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ భాగవతం ప్రాజెక్టు చిత్రకల్పన”,

“దూరదర్శన్ వందేవాల్మీకి కోకిలం టెలీఫిల్మ్ కు సంపూర్ణ రామాయణ-చిత్ర కల్పన”,

“టీటీడీ యస్వీబీసీ భాగవత మందార మకారందాల చిత్రకల్పన”,

“యస్వీబీసీకి శ్రీమతి రావుబాలసరస్వతి గారి రాధాకృష్ణగాన-చిత్ర కల్పన”,

వంటి ఎన్నెన్నో ఆశుచిత్ర కల్పనలతో…శ్రీ కూచి విశ్వవ్యాప్తమయ్యారు.

“ప్రఖ్యాత నవరంగ్ చిత్రకళ గోల్డెమెడల్ పురస్కారం”,

“కళాసంసద్ పురస్కారం”,

“వందే వాల్మీకి కోకిలం టెలీఫిల్మ్ కు ఉత్తమ చిత్రకారునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారం”,

“అమెరికా తానా అరుణ్ గుత్తికొండ చిత్రకళ పురస్కారం”,

“మైసూర్ అవధూత దత్తపీఠం ఆస్థాన చిత్రకారుని పురస్కారం”,

“సంస్కృతి ఫౌండేషన్ చిత్రకారునిగా పురస్కారం”,

స్వస్థలం “అమలాపురం మిత్రసమితి చే చిత్రకళాప్రపూర్ణ పురస్కారం”…వంటి ఆశీస్సులు కూచి కి ఆ శ్రీనివాసుని దివ్యయాశీస్సులే!

“కూచి మరిన్ని చిత్రకల్పనలతో అపురూపమైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వర్ణ రంజితం చేస్తారని…శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి చిత్ర కల్పన లో మచ్చుకి కొన్ని…..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంలో, యస్వీబీసీ నిర్వహణలో  శ్రీఅన్నమాచార్య సంకీర్తన వాహన సేవగా…”ప్రత్యేక బ్రహ్మోత్సవ చిత్రగానం”,

 

రామజన్మభూమిలో రామాలయ శంకుస్థాపన సందర్భాన రామపద్య-చిత్ర సమ్మేళనహారతి “కూచి”కుంచె నుండి….

"రాముడు తలపులోకి రాగానే...కూచి చేతి కుంచె రంగుల్లో దూరి కాన్వాస్ మీద కూచిపూడి చేస్తుంది.

"రాముడిగుడి"కి అంకురార్పణ మహాకార్యంలో.....

హనుమంతులం ఎలానూ కాలేనని ఇదిగో... ఇదో "ఉడుతాభక్తి!"

ఈ ఉడుతకి "తోటి ఉడుతలు" కొన్ని జత గూడాయ్..

అవి:

రచన: శ్రీ కిభశ్రీ

సంగీతం: దీక్షిత్ కూచి

గానం: శ్రీవర్ధని కూచి

కెమెరా: మనోజ్ & సాయిచైతన్య.

ఎడిటింగ్: శ్రీ రఘోత్తమరావు

ఇది

రామార్పణం

సభక్తికంగా...

"కూచి"

చిత్రకారుడు