11_013AV

.

.

యుద్ధం యొక్క ఫలితం ఎప్పుడూ వినాశనమే. మానవజాతి మనుగడకు ఇది చాలా ప్రమాదకరమైనది. ఆదిమ కాలం నుండి ఈ యుద్ధాలు ఉన్నట్లుగా అప్పుడప్పుడు తవ్వకాల్లో బయిట పడుతున్న కొన్ని ఆనవాళ్ళు, మారణాయుధాలను పురావస్తు శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి వెల్లడి చేసే విషయాల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు కేవలం కడుపు నింపుకునే క్రమంలో ఆహారం కోసం ఈ యుద్ధాలు జరిగేవని కూడా పరిశోధనలలో వెల్లడి అవుతూనే ఉంది. కానీ కాలక్రమేణా ఆహారంతో బాటు ఇతర కనీసావసరాలు సమకూడాక మనిషికి ఇంకా ఏదో కావాలని అనిపించడం సహజం. ఆహారంలో విభిన్నత కోరుకుంటాడు. నివాసంలో విభిన్నత కోరుకుంటాడు. ఒంటిని కప్పుకునే వస్త్రం లో విభిన్నత చూస్తాడు. ఇవి సాధించుకోవడానికి అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణ ఫలించి సులువుగా దొరికితే సరే. లేకపోయినా వదలడు. ఎలాగైనా సాధించాలనుకుంటాడు. దానికోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే అంటాడు. కాలక్రమేణా కనీసావసరాలకు లోటు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. పంటలు పండించడం నేర్చుకున్నాడు. ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు. బట్టలు నేయడం నేర్చుకున్నాడు. వాటిని కేవలం తన కనీసావసరాల కోసమే కాకుండా తన మేధస్సును ఉపయోగించి క్రొత్త క్రొత్త ప్రయోగాలు చెయ్యడం ప్రారంభించాడు. ఫలితంగా క్రొత్త ఆవిష్కరణలు జరిగాయి. తృష్ణ పెరిగింది. మన అవసరాలు తీరుతున్నాయి కదా అని తృప్తి పడలేదు. మన దారిన మనం వెడుతుంటే వెంటబడే కుక్కని బెదిరించాలంటే చిన్న కర్రో, చిన్న రాయో సరిపోతుంది. దానికి పెద్ద కత్తో, తుపాకీనో అవసరం లేదు. అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే సాటి మనిషిని నిరోధించాలంటే మాటలతో అర్థమయ్యేటట్లు చెబితే సరిపోతుంది. కానీ అలా ఊరుకోలేం. వాళ్ళని పరుషంగా ఏదో అంటాం. వాళ్ళు ఇంకో రెండు అంటారు. ఇది ఒక్కొక్కసారి కోర్టులవరకు వెడుతుంది. అక్కడ జీవితకాలం గడిచిపోతుంది. మరికొన్ని సార్లు భౌతికదాడులు కూడా జరగవచ్చు. ఇదంతా ఎందుకు అంటే తనకున్న దానితో సరిపెట్టుకోక ప్రక్కవాడి కంటే మనమే అగ్రస్థానంలో ఉండాలి అనే అహం. అంతా నాకే కావాలి అనే స్వార్థం. వీటితో బాటు అభద్రతా భావం కూడా పెరిగిపోతోంది. ప్రక్కవాడిని హింసించో, చంపో మన గొప్పవాళ్ళం అయిపోదామనుకునే వాడికి ఖచ్చితంగా వాడు కూడా మనల్ని ఏం చేస్తాడో అన్న భయం కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే తన శత్రువుని నిర్మూలించడానికి మాత్రమే కాకుండా తన రక్షణకు కూడా ఆయుధాలను సమీకరిస్తూ ఉంటాడు. మానవ మేధస్సు ప్రజల జీవనం మెరుగుపరిచే పరిశోధనలతో బాటు రక్షణ పేరుతో నాశనానికి పనికి వచ్చే పరిశోధనలకు కూడా ఉపయోగపడుతోంది. అవసరాల ధోరణి నుంచి ఆధిపత్య ధోరణి వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంది.

సామాన్య వ్యక్తుల మధ్యనే కాకుండా దేశాల మధ్య కూడా ఇదే ధోరణి. అందుకే అన్ని దేశాలు అణ్వాయుధాల తయారీలో మునిగిపోయి ఉన్నాయి. ఈ ఆధిపత్య ధోరణి, అభద్రతా భావం లేకపోతే ఈ ఆయుధాల అవసరం ఏముంది ?

త్వరలో రష్యా – ఉక్రైన్ ల మధ్య యుద్ధం సమసిపోయి ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుందాం…. 

******************************************************************************************

.

 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ