10_019 ఆత్మీయ సుమాంజలి

Please visit this page

.

.

.

సేవ అంటే ముందు ఉండే వ్యక్తి… ఉపకారం అంటే ఎందుకు, ఎవరికి, ఎలా చేయాలి అనుకోకుండా ఆపన్న హస్తం ముందుకు చాచే మహామనీషి…

.

తను నిత్యం పూజించే గురువుల మార్గాలను తూచా తప్పకుండా ఆచరించి గురుశిష్య బంధాలను ఎలా గౌరవించాలో తానెరిగి, పదిమంది కీ ఆదర్శంగా నిలిచిన నిత్య విద్యార్థి,

.

తాను గురువు స్థాయిలో ఉన్నా నేనింకా నిత్య విద్యార్థినే అన్నట్టు ఉండే నిగర్వి, …

.

నిత్య పూజా గరిష్టుడు… ఇల్లే దేవాలయం చేసుకొన్న నిత్యాగ్నిహోత్రుడు…

.

కొన్ని వందల మంది చేత కొన్ని వేల యజ్ఞాలు, హోమాలు, అర్చనలు, అభిషేకాలు ఆచరింపచెసిన ఆచార్యుడు…

.

ఎంతోమంది కి వివాహ గృహ ప్రవేశాది ముహూర్త కాలాన్ని నిర్దేశించిన సిధ్ధాంతి…

.

రూపాయి ఆశించకుండా, ఎవరైనా ఇవ్వ చూపినా సున్నితంగా తిరస్కరించి కొన్ని వేల జాతక చక్రాలను ఉచితంగా వేసి ఇచ్చిన శాస్త్రజ్ఞుడు…

.

ఆథ్యాత్మిక, సామాజిక మాసపత్రిక “మిహిర” ప్రథాన సంపాదకుడు, ముఖ్యంగా “ శిరాకదంబం ” పత్రికకు వివిధ ఆథ్యాత్మిక అంశాల గురించి తమ ప్రవచనాలను ప్రత్యేకంగా అందించి పత్రిక పురోభివృద్ధికి దోహదం చేసిన ప్రవచనకారుడు …

.

గత మూడున్నర దశాబ్దాలుగా సంస్కృత ఆచార్యుడుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన గురువు… సాధారణ జీవనం సాగిస్తూనే యోగ సాధన ఏరకంగా అభ్యసించాలో నేర్పిన నేర్చిన యోగి… విజయవాడ ఎస్. ఆర్. ఆర్. అండ్ సి. వి. ఆర్. కళాశాల విశ్రాంత ఆచార్యుడు డా. ఇవటూరి శ్రీనివాసరావుగారు కరోనా కాటుకు చిక్కి మే 21వ తేదీన శివైక్యం పొందారు.

.

– వక్కలంక కృష్ణమోహన్

.

************************************************

.

డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి నిష్క్రమణ “ శిరాకదంబం ” పత్రికకు తీరని లోటు. సౌజన్యమూర్తిని, మార్గదర్శకుని, శ్రేయోభిలాషిని పత్రిక కోల్పోయింది. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ప్రవచనాల ద్వారా ఎప్పటికీ “ శిరాకదంబం ” మా గుండెల్లో, మా పాఠకుల / వీక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. వారికి ఉత్తమ గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ….

.

– శిష్ట్లా రామచంద్రరావు మరియు సంపాదక వర్గం

.

.

************************************************