10_009 ద్విభాషితాలు – అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా

ఆహ్వానం..

ఆత్మీయ కరస్పర్శ …….

ఆలింగనం తో…

ఆరంభం కాని  మాటలు..

మనసునెలా తాకుతాయి?

మాటలు మాత్రమే వినిపించి…

నీ కళ్ళలోని భావాలు

నేను చదవలేనప్పుడు..

నీ మాటలు నన్నెలా హత్తుకొంటాయి?

ముఖంలో మెరుపు..

కళ్ళలో ప్రేమ…

పెదవులపై చిరునవ్వు …

నా కళ్ళముందు లేనప్పుడు..

మాటలు నిశ్శబ్దాన్నెలా ఛేదిస్తాయి?

గుండె నొచ్చుకున్నప్పుడు ….

తల వాల్చుకోవడానికి..

ఎదుట నీ బుజం లేనప్పుడు..

గాలిలో తేలి వచ్చే మాటలు ….

ఎలా ఓదార్పునిస్తాయి?

నేస్తమా!

రోమాంచితమైన….

ఓ అనుభూతిని…

నీతో పంచుకోవడానికి..

నాకు మాటల యంత్రం వద్దు !

మాటలు గాలికందని చోట…

ఓ క్షణం మనసు విప్పుకోవాలి!

**********************************