11_014

.

ప్రస్తావన

.

మనం జరుపుకునే ప్రతీ పండుగా సంఘ జీవనానికి ప్రతీక. ‘ చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష ’ అనుకుంటూ మనం, మన కుటుంబం అని గిరి గీసుకుని కూర్చోకుండా మనతో బాటు సమాజంలో ఉన్న వారందరూ మనవారే….. ‘ వసుధైక కుటుంబం ’ – సమాజమంతా ఒకటే కుటుంబం అనే భావనను పెంపొందించేందుకు దోహదపడేవే పండుగలు.

మనకున్నదాంట్లో మన అవసరాలకు పోను మిగిలిన దాంట్లో కొంత భాగమైనా అవసరమైన వాళ్ళకు పంచడం కొన్ని పండుగల సంప్రదాయమైతే, మన సంతోషాన్ని ఇతరులకు కూడా పంచడం మరికొన్ని పండుగల సంప్రదాయం. చాలా పండుగలు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకోవడానికి ఏర్పడినట్లుగా అర్థమవుతుంది. విజయదశమి, దీపావళి వంటి పండుగలు కొన్ని ఉదాహరణలు. అలాంటి మరొక పండుగ హోళీ. ఈ పండుగ వెనుక అనేక రకాలైన కథలు వాడుకలో ఉన్నాయి. హరిభక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోళికను నియోగించాడు. ఆమె కున్న వర ప్రభావం వలన అగ్ని ఆమెను దహించలేదు. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఆమె ఒడిలో కూర్చోమంటాడు. అతడు కూర్చోగానే ఇద్దరినీ అగ్నికీలలు చుట్టుముడతాయి. అయితే నియమోల్లంఘన చేసి మరొక వ్యక్తితో కలిసి కూర్చున్నందుకు గాను అగ్నిదేవుడు ఆగ్రహించి హోళికను దహించివేస్తాడు. విష్ణుదేవుని అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయిట పడతాడు. హోళికా దహనాన్ని సూచించే విధంగా ముందు రోజు చీకటి పడ్డాక మంటలు వేయడం ఆనవాయితీ. మరునాడు రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. ప్రచారంలో ఉన్న కథల్లో ఇదొకటి. మరొక కథ ప్రకారం శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా మన్మథుడు ఆ తపస్సును భగ్నం చేస్తాడు. అందుకు ఆగ్రహించిన మహేశ్వరుడు తన మూడవ కన్నును తెరచి అతనిని భస్మం చేశాడని, అందుకే ఈ పండుగకు కామ దహనం, కాముని పున్నమి అనే పేర్లు కూడా ఉన్నాయని అంటారు. పండుగ ముందురోజు రాత్రి కాముడు అంటే మన్మథుడి దహనానికి సూచనగా మంటలు వేస్తారని చెబుతారు.  

ఏ కథ అసలైన కథో తెలియకపోయినా ప్రజలందరూ కలిసి మెలసి రంగులు చల్లుకుంటూ తమ సంతోషాన్ని తెలుపుకుంటూ జరుపుకునే పండుగ ఇది. సమైక్య భావనకు ప్రతిరూపం.

దక్షిణాది కంటే ఉత్తరాదిలో చాలా ప్రాంతాలలో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. మొదట్లో సహజంగా ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువులతో తయారైన రంగులనే ఈ పండుగలో వాడేవారు. క్రమేణా ఆ స్థానాన్ని రసాయనాలు ఆక్రమించాయి. ఫలితంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కంటి లోకి, నోటిలోకి ఈ రసాయనాలతో తయారుచేసిన రంగులు వెడితే చాలా అనర్థాలు జరుగుతున్నాయి.

అందుకే హోళీ జరుపుకోండి….. కానీ రసాయనాలతో తయారైన రంగులు వాడకండి…. ప్రకృతి సహజమైన రంగులనే ఉపయోగించండి. అవి లభ్యం కాకపోతే హోళీ ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.

పండుగ జరుపుకోవడం మన సంతోషాన్ని అందరితో పంచుకోవడానికే ! దుఃఖమయం చెయ్యడానికి కాదని గుర్తు పెట్టుకోండి.

అందరికీ రంగుల పండుగ శుభాకాంక్షలు.

త్వరలో ‘ ఉగాది ’ పండుగ వస్తోంది. రాబోయేది ‘ శుభకృత్ ’ నామ సంవత్సరం. పేరులోనే శుభాన్ని నింపుకున్న ఈ సంవత్సరం అందరికీ శుభాలే కలిగిస్తుందని ఆశిద్దాం. మీ ఆకాంక్షను శుభాకాంక్షలు గా మార్చి ప్రతి నెలా లక్షకు పైబడి హిట్స్ సాధిస్తున్న ‘ శిరాకదంబం ’ పత్రిక ద్వారా ప్రపంచానికి అతి తక్కువ ఖర్చుతో అందించండి. మీ శుభాకాంక్షల సందేశాన్ని ప్రచురించడానికి కావల్సిన వివరాలకు ప్రక్కన కాలమ్ లో చూడండి. మార్చి 25వ తేదీ లోగా మీ సందేశాన్ని పంపించండి. ఉగాది సంచికలో ప్రచురిస్తాము. వాణిజ్య ప్రకటనలు కూడా ఉగాది శుభాకాంక్షల సందేశంతో అందించవచ్చు. వివరాలకు వెంటనే సంప్రదించండి.  

   .

******************************************************************************************

.

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ