09_018
“ పత్రిక ” గురించి…
* జంధ్యాల గారి జోక్స్ కూడా బావున్నాయి..
– Sivakumar Malladi
“ ఆషాఢం ” గురించి….
* ఇవటూరి వారి ఆషాడ ఔచిత్యం బాగా వివరించారు. వారి బాణీ చాలా బావుంది.. మన సంస్కృతి ని అధ్యాత్మకతను మేళవించారు.. స్వరం కూడా అద్భుతం గా ఉంది..
– Sivakumar Malladi
“ కంచి అత్తి వరదరాజస్వామి స్తుతి ” గురించి….
* Varadha stuthi chadivaanu.actuslga ippudu nenu gudilo unnatu naku anipinchindi.takkinavi atharuvatha chadivedanu.
– Ravindranath Venkataraman
“ వెలుగు నీడలు ” గురించి….
* 🙏
– Lakshmi MV
“ శ్రీపాద కథలు-ఇల్లు పట్టిన వెధవాడబడుచు ” గురించి….
* సమాజానికి ప్రతిబింబాలే కథలోని చాలా చక్కగా నిరూపించారు రచయిత. శ్రీపాద వారి కథలను, కథనాన్ని గురించి ఆనాటి పాఠకులకి క్రొత్తగా చెప్పనక్కరలేదు. అయితే కథావిశ్లేషణ చదివినప్పుడు మానవత్వరాహిత్యం, మానవుల్లో ఉండే ఆవేశకావేషాలు, కోపాలు, అసూయాద్వేషాలు ఏవిధంగా ఉండేవో చాలా చక్కగా ఆవిష్కృతమయ్యాయని చెప్పక తప్పదు.
కథా విశ్లేషణ చాలా బావుందండీ!
చక్కని కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
– Indiragummuluri
* 🙏
– Lakshmi MV
“ తో.లే.పి.-బుజ్జాయి ” గురించి….
* బుజ్జాయి గారిని చూసి చాలా ఆనందించేను.
“దేవులపల్లి వంశం”లో అందరూ కళాకారులే. అందరివీ అందె వేసిన చేతులే. .
– Lakshmi Narayana Murthy Ganti
* dear Sri Voleti Subba Rao Garu,
Congratulations on being on the editorial board of Srikadambam. I shall surely continue to read the articles. Happy to hear of your friendship with my father, Devulapalli Subbaraya Sastri garu aka Bujjai garu. Touched with the love you have for him and our family. I hope to read more from your versatile pen. Warm regards,
– Revathi aka Lalitha Ram.
* CHAALAA BAVUNDI..
– Pb Phanindar
ధన్యవాదాలు తమ్ముడూ..
– Subba Rao Venkata Voleti
* చాలా చాలా బాగుంది
– Rentala Subba Lakshmi
చాలా సంతోషం అమ్మా.. కృతజ్ఞతలు.
– Subba Rao Venkata Voleti
* Very nice anna garu ! My father sri m.s.rama rao garu also sung many of sri krishna sastry garu’s songs. One of the song is ‘nee adugule gaka niru peda bratukunaku ‘. Sri sastry garu’s songs are all thought provoking !
– Nageswara Rao Moparti
చాలా సంతోషం తమ్ముడూ… ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నందుకు ధన్యవాదములు.
– Subba Rao Venkata Voleti
* Congratulations V V Subbarao.
– Dr.Ramaraju Bala Krishna Murthy
ధన్యవాదాలు, అన్నగారూ !
– Subba Rao Venkata Voleti
* Chala bagundi.
– Cbn Valli
ధన్యవాదాలమ్మా..
– Subba Rao Venkata Voleti
* సుబ్బారావు బాబాయి గారు సుబ్బరాయ శాస్త్రి బాబాయ్ గారి గురించి శిష్ట్లా రామచంద్ర రావు బాబాయ్ గారి శిరాకదంబంలో రాయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.😊
బాబాయ్ గారు మీకు నమస్సులు👏 ఎంతో బాగా హృదయానికి తట్టుకునేట్టు రాసారు😊.
మేము బుజ్జాయి గారిని ఈ మధ్యే కలిసాము😊 ఎంతో మృదుభాషి. సున్నితంగా పదాలను పలుకుతూ ప్రేమతో మాట్లాడారు బుజ్జాయి గారు మీరు చెప్పినట్టు.
నేను నాన్న పుస్తకం లోని విషయాలను నేను ఆసక్తి గా అడగటం వారు ఉత్సాహంగా ఎంతో సంతోషం తో సమాధానం ఇవ్వడం నాకు రమేష్ గారికి ఎంతో సంతోషం కలిగించింది.
మీదగ్గర ఎంతో మంచి అలవాటు ఉంది ఇలా ఉత్తరాలు దాచుకోవడం. మీ అమ్మయికి కూడా,అంటే నాకు😊 ఆ అలవాటు ఉంది😊
నాకు ఉత్తరాలన్నా, ఆల్బమ్స్ అన్నా ఇష్టం. Dvd లు,సీడి లు ఇమెయిల్స్ కన్నా😊 ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఎంచక్కా.
మీకు శిరాకదంబం బాబాయ్ గారికి బుజ్జాయి గారికి నమస్సులు😊👏👏👏
– Sridevi Ramesh
అవునమ్మా…అసలు సిసలైన స్నేహానికి చిరునామా బుజ్జాయి గారు…ఆయన పలకరింపులోని ఇంపు అనుభవైకవేద్యం !
– Subba Rao Venkata Voleti
* చాలా చాలా బాగుందండి 🙏🙏🙏
– Lakshmi MV
చాలా సంతోషం అమ్మా… ధన్యవాదాలు.
– Subba Rao Venkata Voleti
* Congratulations sie
– Kala Achutaramiah
అనేక కృతజ్ఞతలండీ~
– Subba Rao Venkata Voleti
* Babai mee tokaleni pitta bavundi
– Indira Srinivas
చాలా సంతోషం ఇందిరమ్మా… ధన్యవాదాలు.
– Subba Rao Venkata Voleti
* శంకర్ గారు అంటే చందమామ కథల కు బొమ్మలు వేసేవారు ఆయనేనా?
– Ayyagari Bala
‘ ద్విభాషితాలు ’ శీర్షికన “ నా భాషకేమైంది ? ” గురించి….
*
– Ayyagari Bala
“ మా నాన్న-సాహిత్య కళాసాగరం ” గురించి…
- “ఈ జీవిత చదరంగంలో మనుషులంతా పావులే” అనే నైరాశ్య ,తత్వ, నేపధ్య గీతాన్ని నవత వారి”జమీందారు గారి అమ్మాయి” సినిమా కోసం మాష్టారు మేము కాలేజీ రోజుల్లో ఉండగా వ్రాసారు. అదొక పెద్ద విశేషం మా అందరికి ఆ రోజుల్లో. తెలుగు శాఖాధిపతి గా ఉన్నా మాష్టారు లో ఎప్పుడూ ఒక ఆధునికత కనిపించేది. ఎప్పుడూ ఆయన కోటు ధరించే వారు. ఎందుకో గాని ఆయన తెలుగు పాఠంలో న్యాయశాస్త్ర ప్రస్తావన తరచుగా చేసేవారు. అమ”లా”పురం అనే మాట విరుపు ఆయనకే సొంతం. ఆయన రచించిన” ఆంధ్ర పుణ్యక్షేత్రాలు” ఒక అతి ప్రాచుర్యం పొందిన వీనుల విందు అయిన పుణ్య క్షేత్రదర్శని. ఇక క్లాసురూములో ఎందుకో గాని అందరికీ భిన్నంగా వెనుక బెంచీ కుర్రాళ్ళకి ఆయన ఎందుకో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ మా మాష్టారి అబ్బాయి కృష్ణ మోహన్ మా బెంచ్ లొనే కూర్చోవడం ఒకింత గర్వం ఆ రోజుల్లో. వారి నివాసం పేరు” కవిత” ఆ ఇల్లు ఓ “మమత” ల నిలయం.
– Gbvsastry
* వక్కలంక లక్ష్మీపతి గారి చూడడం మాట్లాడడం, డాక్టరేట్ రావడం , వచ్చిన తరువాత ఎంతో ఆనందం తో కనిపించారు. కోనసీమ కవి కోకిల గారి గురుంచి మరింత విపులంగా తెలుసుకోవడం చాలా సంతోషం. ధన్యవాదములు..
– Sivakumar Malladi
“ మా నాన్న-కర్మజీవి ” గురించి….
* తండ్రుల దినోత్సవం అన్న మాట చాల చిరాకు గా ఉన్నా, బదరి నాన్నగారి లాంటి విశిష్ట వ్యక్తిని తెలుసుకునే అవకాశం కల్పించినందుకు సంతోషించాలేమో
ప్రతి వ్యక్తికీ తన తండ్రి గురించి చెప్పాలనే ఉంటుంది.. కానీ తన రచన సామర్ధ్యాన్ని చాలా పొదుపుగా వినియోగిస్తున్న బదరి, ఇక్కడ పొదుపు చూపించకుండా చాలా విపులంగా రాశాడు . అలా రాయడం నాలాంటివాడికి సాధ్యం కాదు. మనసులోని భావాలని చక్కగా వ్యక్తీకరించగలగడం నేర్చుకుంటే వచ్చేది కాదేమో .
వాళ్ళ నాన్నగారిని , వాళ్ళ ఇంట్లోనే కలవడం , కలిసి భోజనం చేయడం ఒక మధురమయిన స్మృతి . మా నాన్న గురించి కూడా రాయాలనిపించేలా రాసిన బదరికి, రాయించిన రామచంద్ర రావు కి అభినందనలు —రమణ శర్మ
* “అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్ దేవుడు.”
‘అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు.
పితృ దినోత్సవం సందర్బంగా గొర్తి బద్రి శాస్త్రి గారు రాసిన వ్యాసం మా నాన్న కర్మ జీవి చదువుతుంటే నాన్న- సముద్రమంత గంభీరంగానూ, అకాశమంత నిర్మలంగానూ, విలుప్త అగ్నిపర్వతం మాదిరి గుండె నిబ్బరం తోనూ జీవించగలడు అనే దానికి నిదర్శనం గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు అని వేరేగా చెప్పనక్కర్లేదు.
స్వతహాగా విద్యాధికుడు మరియు ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నప్పటికీ, తండ్రి మాట కోసం తన ప్రగతిని పణంగా పెట్టి, మట్టిని నమ్ముకుని మట్టి మనిషి అయిపోయి ఆ మట్టిని బంగరముగా మార్చిన వ్యక్తి సత్యనారాయణ మూర్తి గారు. ఎటువంటి భేషజాలకు పోకుండా ఉన్నదాంట్లో ఊరి వాళ్లకు సహాయం చేసిన వ్యక్తిగా అతని ఉదారత్వానికి మరియు
మంచితనానికి పరాకాష్ట అతని జీవితం .
ఇదంతా రాయడానికి కారణం నేను స్వయంగా బద్రి గారి స్వగ్రామం నేదునూరు అలాగే వాళ్ళ అన్నదమ్ములు అప్పచెలళ్ళు తమ బాల్యాన్ని గడిపిన ఆ ఇల్లును వీక్షించిన తరువాత ప్రతి ఒక వస్తువును అలాగే బద్రి గారు ఆ ఇంటితో ఉన్న అనుబంధం వాళ్ళ నాన్నగారి విశేషాలను ముచ్చటించినప్పుడు అతనిలో ఆనందం అభిమానం చాలా దగ్గరగా చూసాను. మొత్తం చరిత్ర అంతా ఒక సినిమా రీలుగా అనిపించింది.
అటువంటి మహానుభావుల జీవితం భావితరాల వాళ్ళకి ఒక స్ఫూర్తి మరియు ప్రేరణదాయకం.
– Durga Prasad
* Older generation are committed to desires of their elders.even if they have to sacrifice their choice oflife that’s the way they lead the life.
He was a great soul who enjoyed his life in bringing the children and giving them the freedom to choose the profession rather asking them to join the agriculture.
But his qualities of meticulas planning and execution we can see in our friend Bhadhri.
No doubt he is karma yogi.
– K.prabhakar murthy
* దశరథ తనయుడు తండ్రి మాటకి కట్టుబడి రాజ్యం విడిచి అరణ్యాలకు వెల్తే, తండ్రి మాట విని శ్రీ గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు జనారణ్యము విడిచి తండ్రిని చేరి పవిత్ర వ్యవసాయం వృత్తిగా చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, అన్నగారి భూమి కూడా నిస్వార్థంగా సాగు చేసి ఫలసాయం వారికి అప్పజెప్పిన తీరు ఒకటయితే, మూగ జీవాలు ప్రేమతో యజమానిని చూడడానికి పొలం నుంచి ఇంటికి వచ్చిన తీరు ఆవిష్కరణ మనసుని కదిలించింది.
– వక్కలంక కృష్ణ మోహన్
- – Gorthy B S Subrahmanyam
* చాలా విలువైన సలహాలిచ్చినమీ పూజ్య పితృదేవులకు ప్రణామాలు.
– Ramana Balantrapu
* మా నాన్న కర్మజీవి 🙏🙏. . సొంత ఊళ్ళో తండ్రికి ఆసరాగా ఉండడం కోసం… మంచి ఉద్యోగం వదిలి… వ్యవసాయం లోకి ప్రవేశించడం… అన్న విషయం .. నేటి యువత అలవర్చుకోవలసిన గొప్ప సంస్కారం !
– Nagesh Babu Dwibhashyam
* Great
Annapurna Sanivarapu
“ సహజత్వమే నా శైలి-కస్తూరి ” గురించి….
* “సహజత్వం” ఈ పదం ఆ రోజుల్లో చాలా తక్కువ గా ఫోటోగ్రఫీలో వినిపించే మాట 70 వ దశకంలో. ముఖ్యంగా కలర్ సినిమా అంటే ముదురు రంగులు తెర అంతా ఎంత కొట్టొచ్చే రంగులతో కనిపిస్తే అంత కంటికి ఇంపు అనే రోజులు. ముఖ్యంగా 1973 తరువాత కలర్ సినిమాలు రావడం ఎక్కువై ప్రేక్షకులు వాటినే చూస్తున్న రోజుల్లో మార్పు మొదట సారి చూసింది ఇషన్ ఆర్య ద్వారా ముత్యాల ముగ్గు, తరువాత గోరంతదీపం. ఆ తరువాత బాలూమహేంద్ర, కస్తూరి గార్ల శంకరాభరణం. అదే సమయంలో వీరి ద్వారానే వచ్చిన”నెంజేత్తై కిళ్లాదే” (తెలుగులో మౌనరాగం) వంటివి గొప్పగా చెప్పుకోవచ్చు.
ఇక సప్తపది లో ముఖ్యంగా కనిపించేది కథతో పాటె కెమెరా వెళ్లడం. నటుల ముఖాలు ప్రత్యేకంగా కనిపించాలి అనే నియమం లేకుండా మొత్తం సన్నివేశాన్ని కే ప్రాధాన్యత ఇవ్వడం, ఇక మనిషి నీడ కూడా సన్నివేశం లో అంతర్భాగంగా ఉంచడం వంటి అంశాలు ఈ” సహజత్వం” అనే మాటని సాధికారికంగా కస్తూరి గారు సొంతం చేసుకునే టట్టు చేశాయి. బహుశా వారు చెప్పినట్టు ఈ సినిమాకి ఈ మధ్యనే దివంగతులయిన “కణ్ణన్” తో పోటీ “అలైగల్ ఓయవ దుళ్ళై” ( ‘ సీతాకొక చిలుక ‘ తెలుగు ) వచ్చి ఉంటుంది. వ్రేపల్లియ “ఎద ఝల్లన” పాట మొదటి లో కృష్ణా నదిలో సూర్య కిరణాలు తీసిన విధానం, కణ్ణన్ గారు కన్యాకుమారి దగ్గర “ముట్టం” అనే చోట ఇదే విధంగా సముద్రపు కెరటాలు తీరాన్ని తాకి వెనక్కి వెళుతున్నప్పుడు పడిన సూర్యాస్తపు కిరణాలు తో పోటీ పడి కస్తూరి గారికే అవార్డు వచ్చి ఉంటుంది.
సప్తపది అమరావతి తీరాన్ని, కృష్ణ సొగసుల్ని, కొండల్ని ఏ విధమైన కృత్రిమత్వం లేకుండా చూపించిన చిత్రం. జ్యోతి ఆర్ట్ అని మొదట వచ్చినప్పుడు సూర్యుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక కిరణం హారతి గా చుట్టూ తిరగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కధని కెమెరా చెప్పాలనే సూత్రం ఉన్నా కొన్ని చోట్ల కెమెరా మెరుపులు బయటకి అవే వచ్చేస్తాయి. ఆ మెరుపులు వేదానికి చేసిన నాట్యం లో గమనించవచ్చు.
– Gbvsastry
* Wow… Thank you.
– Meer S
* రామచంద్రరావు గారితో స్నేహం వలన…. కస్తూరి గారి సహజ ఛాయాగ్రహణ ప్రతిభ… రామచంద్రపురం పట్టణంలో లో జననీ జన్మ భూమి shooting జరిగినపుడు ప్రత్యక్షం గా చూసాను. మళ్ళీ… ఇన్నాళ్లకి… ఇది చదివి చాలా సంతోషించాను.
– Nagesh Babu Dwibhashyam
* Very talented photographer
– MohanRao Vakkalanka
* కస్తూరి గారి గురించి సిరా గారు చెప్పినప్పుడు నా చిన్నప్పుడు విన్నాను. ఇప్పుడు విరిగురుచి తీసుకోవడం చాలా బావుంది. ధన్యవాదములు..
– Sivakumar Malladi
“ పసితనం – పసిడిమయం ” ( 09_017 ) గురించి…
* Dear editor
ఈ రోజు సాయంత్రం ఎందుకో సిరా కదంబ సంచికని యధలపంగా చూడడం జరిగింది. అందులో పసితనం, పసిడి మయం అన్న శీర్షిక ఆకర్షించింది.
సరే ఒకసారి చదువుదాం అని చదివాను. మళ్లీ ఎందుకో మరొకసారి చదువుదాం అనిపించింది. మళ్లీ మళ్లీ చదివాను. ఒక్క సారిగా ఆశ్చర్యం అనిపించింది. అరె ఈయనికి నా బాల్యం గురించి ఎలా తెలుసు?. కాదు కాదు ఈయనకి చాలా మంది బాల్యం గురించి చిన్నతనం గురించి తెలుసు నేమో అని అనిపించింది.
అదే కథకుడు మనుషుల ఆలోచన లోంచి హృదయాల లోకి తొంగి చూసి రాస్తాడు కదూ.
ఆ ! ఆ పరకాయ ప్రవేశము అన్న ప్రక్రియే ఇక్కడ జరిగింది.
సరే ఇంత చక్కటి జర్నీ ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక నన్ను నేను relate చేసుకొన్నాను. సరే కానీయ్ అన్నాడు.
బస్ ఎక్కించాడు. పడవ ఎక్కించాడు. పడవలో కొబ్బర్ణోజు కొనిపెట్టమని అడిగాను. కళ్ళతోనే వారించాడు వద్దని. చిన్నబుచుకొనాను. గమనించాడు.
అమ్మమ్మ గారింటికి వెళ్ళాం. మండు వేసవి ఎండలు చుర్రు మనిపించెలా చేశాడు. చక్కటి సాయం కాలపు గాలిలొ సేద తీర్చాడు. రోజూ మొదలయ్యే చద్ది అన్నం తో బ్రేక్ఫాస్ట్ చేయించాడు. ఊరి పెద్దలు ఆప్యాయంగా ఇచ్చిన బంగినపల్లి మామిడి పండ్లు రుచి చూపించాడు. రసాలురు రసాలు చవి చూపించాడు.
అంతేనా తేనే మాధుర్యాన్ని చవి చూడమని పనస తొనలు తినిపించాడు.
గోటి తో మీటితే చేదిరేటటువంటి తాటి ముంజలు తినిపించాడు. ఆట విడుపు కోసం ఆ ముంజల్నే బండి గా చేసి ఆడుకో అన్నాడు.
అమ్మమ్మ, మావయ్య, అత్తయ్య ల మమకారాన్ని పంచాడు. వెరసి పదే పదె తల్చుకొనెలా ఒక చక్కని అనుభూతిని మిగిలిచ్చాడు.
తన విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ, తన పర్యటన తాలూకు జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ, మనవల తో హాయిగా ఆడుకుంటున్న సమయాన, తన గత స్మృతుల లోకి జారుకొని, మధురాతి మధురమైన ఆ బాల్య జ్ఞాపకాలని మనకందించిన ఆ వ్యక్తి ఎవరో మీకు చెప్పలేదు కదూ.
ఆ! ఆయనే నా మిత్రుడు, సహాధ్యాయి మాస్టారు గారి అబ్బాయి, శ్రీ కృష్ణ మోహన్.
ఒక భావనని అక్షర రూపం ఇవ్వాలని ఉన్నా అందరికీ అది సాధ్యమయ్యే పనికాదు. అది ఏ కొద్దిమంది మాత్రమే చేయగలరు.
నాకు ఒకరకంగా ఆశ్చర్యం గా ఉంది / ఆశ్చర్యంగా కూడా లేదు.
ఎందుకంటారా సాహితీ సంపదని మాస్టారు లక్ష్మీపతి రావు గారినుంచి వారసత్వం గా పొందిన కృష్ణమోహన్ ఇటువంటి కథనాలు వ్రాయడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఇటువంటి మరిన్ని అణిముత్యాలు, కథనాలు మిత్రుడు కృష్ణమోహన్ కలం నుండి రావాలని ఆశిస్తూ, శుభాభినందనలు తెలుపుకొంటు, ప్రచురించిన సిరా కదంబం రామచంద్ర రావు గారికి, సంపాదక వర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటన్నాను.
ఇట్లు
శ్రీనివాస రావు.