12_002Av కూచిపూడి జావళీలు

జావళి అనే మాట మరాఠీ లేదా కన్నడ పదం ‘ జావడి ‘ నుంచి వచ్చిందని ఒక వాదన. సంస్కృత పదం ‘ జ్యా ‘ నుంచి వచ్చిందని మరొక వాదన. ‘ జ్యా ‘ అంటే మన్మథుని విలు త్రాడు. ‘ ఆవళి ‘ అంటే వరుస.

సాధారణంగా జావళి లో పల్లవి, చరణం మాత్రమే ఉంటాయి. అనుపల్లవి ఉండదు. ఈ కారణంగా శ్రావ్యంగా స్వర రచన చెయ్యడానికి, పదాలతో ఆటలాడుకోవడానికి స్వరకర్తలకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. జావళి లో వేగం ఎక్కువ. జావళి సంగీతం ఆకర్షణభరితంగాను, భాష సరళంగాను, వ్యవహరిక భాషలోనూ, శృంగార భరితంగానూ ఉంటుంది. శాస్త్రీయ, లలిత సంగీతాల సమ్మేళనంగా ఉంది, ఉత్తర దక్షిణాది సంగీత పద్ధతుల సమ్మేళనంగా ఉంటుంది. జావళి యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శృంగార భరితంగానూ, ప్రేమ మయంగాను ఉంటుంది .     

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾