Webmagazine

12_007 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి నెల కార్యక్రమం ‘ అన్నమయ్య ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు, కాకినాడ లోని ప్రజావిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన ‘ సంక్రాంతి సంబరాలు ‘ చిత్రకదంబం……

12_007 ముకుందమాల – భక్తితత్వం

ఏనుగు కొలనులో దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది. తిరిగి బైటికి రాగానే దుమ్ముని మీద చిమ్ముకుంటుంది! మరింత దుమ్ము అంటుకోవడానికే కానీస్నానం వలన ప్రయోజనమేమీ ఉండదు. అందుకే భక్తిహీనకార్యాన్ని గజస్నానంతో పోలుస్తారు
అందుకే తీర్థయాత్రల్లో స్నానం చేశాము అనుకోవడం రాజసం పెరగడానికి కాకరజస్తమస్సులు తొలగి సత్వగుణం పెరిగిభగవత్ప్రాప్తిని కల్గించడానికి ఉపయోగపడాలి. శ్రీమన్నారాయణ చరణ స్మరణ పూర్వకంగా చేసిన నాడు అలా ఫలప్రాప్తిని పొందవచ్చు భగవదనుగ్రహంతో.

11_008 ముకుందమాల – భక్తితత్వం 03

ముకుందః! దేవః! దేవకీనందన జయతు జయతు మోక్షమునిచ్చే వాడు ముకుందుడు. ఎవరీ ముకుందుడు ? మా దేవకీనందనుడే! తానెక్కడో గోలోకంలోనో, వైకుంఠంలోనో ఉంటే మనం తనను చేరలేమనీ, పొందలేమనీ, తానే దిగివచ్చి, తనచేత సృష్టించబడిన ఈ జగత్తులో, ఒక తల్లిగర్భాన పదినెలలు వసించి, ఆ తల్లి కడుపుపంటగా, ఆనందసంధాయకుడై, జన్మించినాడు.

11_002 – వార్తావళి

అమెరికా లోని బాటా ( BATA ) వారి ‘ వర్చుయల్ మేచ్ మేకింగ్ ఈవెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ’ వివరాలు, తానా ( TANA ) వారి “ పాఠశాల ” వివరాలు, కెనడా తెలుగు సాహితీ సదస్సు, అమెరికా తెలుగు సాహితీ సదస్సు మొదలైన కార్యక్రమాల వివరాలు

11_002 – ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం “ మాలతీ చందూర్ – సామాజిక దృష్టి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు మరియు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ మా అన్నయ్యతో అనుబంధం ” – సోదరీమణుల జ్ఞాపకాలు, చెన్నైలో ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ, అమెరికా శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “ అమెరికాలో తెలుగు భాషా వికాసం ”….. కార్యక్రమాల విశేషాలు….

11_002 హాస్యగుళికలు – ఆవకాయ పెట్టాలా ? వద్దా ?

అత్తగారు: ఆఁ, నీ చేతి వంట తినలేక ఛస్తున్నాను. కూరలో ఉప్పు ఉండదు, పచ్చట్లో పులుపు ఉండదు, పులుసులో ముక్కలుండవు, చారులో ఘాటు ఉండదు. నా నాలుక చచ్చిపోయింది. నా నోటికి కాస్త ఆవకాయ తగిలిస్తే గాని ప్రాణం లేచిరాదు.
కోడలు: ఎందుకండీ ఒళ్ళు పాడు చేసే ఆవకాయ మీద అంత మోజు? తాజాగా రోజుకొక పచ్చడి చేసుకొని హాయిగా తినచ్చు కదా?

11_002 ప్రతీచి – లేఖ

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.
కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం.

11_002 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – జానకి

“ నీ పిల్లలు నీకు చిన్నవాళ్ళుగా కనిపించచ్చు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. దాన్నే ఇక్కడ యడలెసన్ స్టేజ్ అంటారు. ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళలో మార్పు రావడం సహజం. అది నువ్వు అర్ధం చేసుకోవాలి. ”